భవిష్యత్ బీఆర్ యస్ దే …12 ఎంపీ సీట్లలో బీఆర్ యస్ జెండా ఎగురుతుంది…
ఖమ్మంలో నామ గెలిచి కేంద్రంలో మంత్రి అవుతారు
నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజలకు నమ్మకం పోయింది
కాంగ్రెస్ మోసం చేసిందని ప్రజలు భావిస్తున్నారు
బీఆర్ యస్ ను ఓడించి తప్పు చేశామని ప్రజలు మదనపడుతున్నారు
అందుకే కేసీఆర్ సభలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
“దృక్పధంతో ” రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర
గాయత్రీ రవి అలియాస్ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యుడు…పిలిస్తే పలికే నాయకుడు … కలుపుగోలు తనం, తనదగ్గర ఉన్నదాంట్లో నలుగురికి పంచాలనే మనస్తత్వం …ఎవరు ఏది అడిగిన కాదనని నైజం ఆయన సొంతం …బీసీ బిడ్డగా రాజ్యసభ సభ్యునిగా తనకు వచ్చిన అవకాశాన్ని పలువురికి మంచి చేయాలనే తలంపుతో ముందుకు సాగుతున్ననేత …అందుకే ఆయన ఇంటికి ప్రజలు క్యూకడుతుంటారు …ఖమ్మంలో ఆయన ఇంటికి వచ్చాడని తెలిస్తే చాలు కొద్దీ నిమిషాల్లోనే వందలమంది గుమికూడతారు …దానికి తగ్గట్లుగానే వచ్చినవారిని రిసీవ్ చేసుకోవడం , వారికీ ఏమికావాలో అడగటం అందుకు తనవంతు ప్రయత్నం చేయడం నిత్యకృత్యం … రాజకీయాల్లో ఎదో చేయాలనే తపన ఆయనలో కనిపిస్తుంది …పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ యస్ ఖమ్మం అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలుపు కోసం రాత్రి పగలు అనే తేడాలేకుండా తిరుగుతున్నారు …తీరిక దొరికినప్పుడల్లా మహబూబాబాద్ లోకసభ బీఆర్ యస్ అభ్యర్థి మాలోత్ కవిత కోసం జరిగే ప్రచారంలో పాల్గొంటున్నారు …ఆయన్ను “దృక్పధం ” పలకరించగా మంచి జోష్ తో రాష్ట్రలో 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని చెప్పారు …
చట్టసభల్లో ప్రవేశించాలని తన కోరికను తీర్చిన దేవుడు కేసీఆర్
చాలాకాలంగా చట్టసభల్లో ప్రవేశించాలని తన కోరికను కేసీఆర్ నెరవేర్చడంతో ఆయనపై అచంచలమైన అభిమానంతో ఉన్నారు … నిజంగా కేసీఆర్ దేవుడితో సమానమంటున్నారు… ఎన్ని జన్మలు ఎత్తిన కేసీఆర్ ఋణం తీర్చుకోలేనని అన్నారు …ఎక్కడో ఇనగుర్తి అనే మారు మూల గ్రామంలో పుట్టిన తనకు దేశంలో అత్యన్నతమైన పెద్దలసభగా చెప్పబడే రాజ్యసభకు ఎంపిక చేయడం తన జీవితంలో ఒక మరుపురాని ఘట్టం … చరిత్రలో నిలిచిపోయే సంఘటన … ఒక టర్మ్ రెండు సంవత్సరాలకు ,మరో టర్మ్ ఆరు సంవత్సరాలకు రాజ్యసభ సభ్యుడుగా అవకాశం కల్పించిన బీఆర్ యస్ అధినేత కేసీఆర్ కు రుణపడి ఉంటానని అంటున్నారు వద్దిరాజు …ఇటీవల రెండవసారి రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన లోకసభ ఎన్నికల్లో బీఆర్ యస్ అభ్యర్థుల విజయం కోసం అహోరాత్రులు శ్రమిస్తున్నారు …అధినేత కేసీఆర్ , వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఖమ్మం , మహబూబాబాద్ నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థుల గెలుపుకోసం కష్టపడుతున్నారు …
భవిష్యత్ బీఆర్ యస్ దే అందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు …12 ఎంపీ సీట్లను గెలవబోతున్నాం …ఖమ్మంలో నామ గెలిచి కేంద్రంలో మంత్రి అవుతారు …బీజేపీకి కూడా 200 సీట్లు మించి రాకపోవచ్చునని సర్వేలు చెపుతున్నాయి…కేంద్రంలో రానున్నది సంకీర్ణమే …కేసీఆర్ కీలక పాత్ర పోషించబోతున్నారు …రాష్ట్రంలో అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ ప్రజల్లో విశ్వాసం కోల్పోయింది …పథకాల అమల్లో కుప్పిగంతులు వేస్తుంది … రైతుబంధు జమ కాకపోవడంపై రైతులు భగ్గు భగ్గుమంటున్నారు … పైగా తమ చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు బీఆర్ యస్ పై నిందలు వేస్తుంది …ప్రజలు కాంగ్రెస్ మోసాలను గమనించి కేసీఆర్ ను ఓడించడంపై మధనపడుతున్నారు …అందుకే ఆయన రాష్ట్రంలో జరుపుతున్న పర్యటనలకు బ్రహ్మరథం పడుతున్నారు … కాంగ్రెస్ అధికారంలో ఎంతకాలం ఉంటుందో చూడాల్సిందే ….