- ఎంపీ అభ్యర్థి రఘురాం రెడ్డి సమక్షంలో గొల్లపూడిలో వంద కుటుంబాల చేరిక
- వైరా మండలంలో బీఆర్ఎస్ కు పెద్ద షాక్
వైరా: బీఆర్ఎస్ పార్టీకి వైరా మండలంలో కోలుకోలేని దెబ్బ తగిలింది. జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, ఎంపీపీ వేల్పుల పావని బీఆర్ఎస్ ను వీడారు. ఆదివారం గొల్లపూడి గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ ఎంపీ అభ్యర్థి రామ సహాయం రఘురాం రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. ఇంకా కౌన్సిలర్ డాక్టర్ కోటయ్య, మాజీ సర్పంచ్ మేడూరి రామారావుతో పాటు వంద కుటుంబాల వారికి పార్టీ కండువాలు కప్పి.. రఘురాంరెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన వారందరికీ అండగా ఉంటామన్నారు. ఈ ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువాళ్ల దుర్గాప్రసాద్ సీనియర్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, నాయకులు బొర్రా రాజశేఖర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నర్సిరెడ్డి, ధార్నా రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు…