Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

రామసహాయం రఘురాంరెడ్డి స్థానికుడే …మాగ్రామం వాసే …డాక్టర్ శ్రీదేవి

ఖమ్మం పార్లమెంట్ కు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న రామసహాయం రఘురాంరెడ్డి ముమ్మాటికీ స్థానికుడే అని …తమ గ్రామవాసి అని ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ బొలికొండ శ్రీదేవి అన్నారు …ఆదివారం ఖమ్మంలోని శ్రీదేవి నర్సింగ్ హోమ్ లో రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ఆత్మీయసమ్మేళనంలో రఘురాంరెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ,డాక్టర్లు , ఇతర ప్రముఖులు పాల్గొన్నారు …ఈసందర్భంగా ఆమే మాట్లాడుతూ రఘురాంరెడ్డి స్థానికుడు కాదనే ప్రచారాన్ని ఖండించారు …ఆయనది తమ గ్రామమే అని గ్రామంలో వారికీ ఉన్న ఆస్తులు కొన్ని దానం చేశారని గ్రామంలో స్కూల్ కు ఇచ్చిన స్థలం కూడా వారిదేనని ఆమే తెలిపారు…మొదటి నుంచి ప్రజలకు సహాయం చేసే దానిలో ముందుండే వంశమే వారిది ఆమే కొనియాడారు …

ఈకార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు రాయల నాగేశ్వరరావు, బేబీ స్వర్ణకుమారి, మొక్క శేఖర్ గౌడ్, వడ్డెబోయిన నరసింహారావు, కూసుమంచి మండలం చేగొమ్మ మాజీ ఎంపీటీసీ బొలికొండ శ్రీనివాస్, కార్పొరేటర్ విజయ, మాట్లాడుతూ తరతరాలుగా ప్రజలకు సేవ చేస్తూ వారికి అండగా నిలుస్తున్న కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి సేవలు ఖమ్మం జిల్లాకు ఎంతో అవసరమని అన్నారు. కూసుమంచి మండలం చేగొమ్మ వారి స్వగ్రామం అని, దాదాపు వారి వంశస్తులకు 3000 ఎకరాల భూమి ఉండగా ప్రజలకు ధారాదత్తం చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. వారి స్వగ్రామంలో పాఠశాలకు స్థలం ఇచ్చి పాఠశాలను నిర్మించి ఆ ప్రాంత ప్రజలకు విద్యాదానం చేసిన మహోన్నతులని కొనియాడారు. రామ సహాయం రఘురామిరెడ్డి స్థానికుడు కాదనే విమర్శను వారు తిప్పి కొట్టారు. ప్రజలకు సేవ చేసే పెద్ద మనస్తత్వం వారి వంశమని అలాంటి వంశంలో పుట్టినటువంటి రఘురామిరెడ్డి మన ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేయడం ఎంతో అభినందనీయమన్నారు అలాంటి అభ్యర్థిని మనమంతా కలిసి అత్యధిక మెజారిటీతో గెలిపించి పార్లమెంట్ కు పంపించాల్సిన అవసరం ఎంతో ఉందని వారన్నారు.

మీఆత్మీయతకు రుణపడి ఉంటాను …ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి

తన గ్రామస్తురాలైన శ్రీదేవి తన విజయాన్ని కాంక్షిస్తూ ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని అనేక ఆత్మీయసమ్మేళనాలు జరిగిన తన గ్రామస్తురాలైన డాక్టర్ శ్రీదేవి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు …ఇందుకు వారికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు … తన సహాయ సహకారాలు వెళ్ళ వేళల ఉంటాయని హామీ ఇచ్చారు ..

ఈసందర్భంగా రాజకీయాలను గురించి ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం ఏడు లక్షల అప్పులను కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పిందని ఒక్క తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయిందని విమర్శించారు … ధరణి వ్యవస్థను అస్తవ్యస్తం చేసి పారేసిందని 1,50,000 కోట్ల కాలేశ్వరం ప్రాజెక్టును కుప్పకూల్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 150 రోజులు కూడా కాలేదని అంతలోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమపై చేస్తున్న ఆరోపణలు అర్ధరహితమన్నారు పది సంవత్సరాలు పాలించిన వారు ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేకపోయారని సంగతి గుర్తుంచుకోవాలన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలన్నింటినీ ఆదాని అంబానీలకు అప్పజెప్పుతున్నారన్నారు. 400 రూపాయలు ఉన్న గ్యాస్ ధర బిజెపి ప్రభుత్వంలో 1100 రూపాయలకు పెరిగిందన్నారు 65 రూపాయలు పెట్రోల్ ధర ఉండగా 110 రూపాయలకు పెంచారన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఎంతో ప్రమాదకరమైందని సెక్యులరిజం ప్రజాస్వామ్యం కూలిపోయే ప్రమాదం దాపురించిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ డి, సి బి ఐ సంస్థలను తమ జేబు సంస్థలుగా భావిస్తుందన్నారు. అత్యంత ప్రమాదకరమైన బీజేపీ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి కాంగ్రెస్ కు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన ప్రజలను కోరారు.

Related posts

పాలేరు గడ్డపై పొంగులేటి విజయగర్జన …పాలేరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం …!

Ram Narayana

ఖమ్మం జిల్లాలో షార్ట్ లిస్ట్ కాంగ్రెస్ అభ్యర్థులు వీరే …!

Ram Narayana

పాలేరు ప్రజల రుణం తీర్చుకుంటా … మంత్రి పొంగులేటి…

Ram Narayana

Leave a Comment