Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

కొత్తగూడెం సింగరేణి కార్మికవాడల్లో నామ విస్తృత ప్రచారం …

కేంద్రంతో పోరాడి, వత్తిడి తెచ్చి సింగరేణి సంస్థను, కార్మికుల భవిష్యత్ ను కాపాడుకున్నా మని బీఆర్ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం రుద్రంపూర్ 5 ఇoక్లైన్ తో పాటు సింగరేణి ప్రధాన కార్యాలయం తదితర ప్రాంతాల్లో నామ మంగళవారం విస్తృతంగా పర్యటించి, నిర్వహించిన , ఎన్నికల ప్రచారానికి అనూహ్యమైన స్పందన లభించింది. నామకు ఆప్యాయంగా సాదర స్వాగతం పలికి అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయన సింగరేణి కార్మికులను వ్యక్యిగతంగా కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కారు గుర్తుపై ఓటు వేసి,తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.రెండు సార్లు గెలిపించి, పార్లమెంట్ కు పంపితే ఎంతో అభివృద్ధి చేశానని చెప్పారు. కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతంతో తనకు ఎంతో అనుబంధం ఉందన్నారు. ఈ ప్రాంతంలో ఉండి చదువుకుని, ఇక్కడే రోజు కూలీ మూడున్నర రూపాయలకు పనిచేసిన అనుబంధం ప్రజలతో ఉందని అన్నారు. భద్రాచలం – కొవ్వూరు రైల్వే లైన్ కోసం కేంద్రానికి 120 లేఖలు రాసిన చరిత్ర తనది అన్నారు. ఇప్పుడు గెలిపిస్తే కార్యకర్తలను, ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని నామ చెప్పారు. ఓటు కోసం వచ్చే కాంగ్రెస్ వారిని హామీలు సంగతేమిటని నిలదీయాలని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మోసపూరిత వాగ్దానాలతో ప్రజల్ని మోసగించిన కాంగ్రెస్ మళ్ళీ ఇప్పుడు లేనిపోని భ్రమలు కల్పించి, ఓట్లు కొల్లగొట్టాలని చూస్తుందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే న్యాయ నిర్ణేతలని, జాగ్రత్తగా ఆలోచించి ఓటు అనే వజ్రాయుదాన్ని వాడాలని కోరారు. పక్కా లోకల్ వ్యక్తినైన తనను ఎన్నుకుంటే ఏ సమయంలో ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని, అండగా ఉంటానని నామ చెప్పారు.ఈ కార్యక్రమంలో కాపు సీతామహాలక్ష్మీ, వనమా రాఘవ, ఉప్పల వెంకట రమణ, స్థానిక పార్టీ నేతలు, సింగరేణి కార్మిక నాయకులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటా

పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని , తనను మంచి మెజార్టీతో గెలిపించి, కేసీఆర్ కు మద్దతుగా నిలవాలని బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పేర్కొన్నారు. కొత్తగూడెం మండలం హేమచంద్రాపురం లో నామ గారి సమక్షంలో మంగళవారం కొంపెల్లి వెంకన్న , తరాల దాము యాదవ్, ఇందారపు రమేష్, నాగనబోయిన లింగయ్య ఆధ్వర్యంలో కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన వందమంది కార్యకర్తలు బీఆర్ఎస్ లో చేరారు. పార్టీ కండువా కప్పి వారిని నామ నాగేశ్వరరావు పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నామ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రజా క్షేత్రంలో సైనికుల్లా పని చేసి, తనను అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో వనమా రాఘవ, ఉప్పల వెంకట రమణ, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతామహాలక్ష్మీ, ఎంపీపీ బాదావత్ శాంతి, తోగరు రాజశేఖర్, తేరాల వీరభద్రం, ఎస్కె అన్వర్ పాషా, యాకూబ్ , వేల్పుల దామోదర్, నవతన్ , అనుదీప్, మోరే భాస్కర్ , తదితరులు పాల్గొన్నారు.

Related posts

జర్నలిస్టులకు ఉచితంగా హోమియో మందులు పంపిణీ

Ram Narayana

ప్రభుత్వం వైద్య ఉద్యోగులకు అన్యాయం చేయవద్దు…ఖమ్మం జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు అఫ్జల్ హాసన్!

Ram Narayana

పాలేరు గడ్డపై పొంగులేటి విజయగర్జన …పాలేరు గ్రామం నుంచి ప్రచారం ప్రారంభం …!

Ram Narayana

Leave a Comment