తెలుగు రాష్ట్రాలు

రేపు కుటుంబ సభ్యులతో కలిసి ఢిల్లీ వెళ్లి ‘పద్మ విభూషణ్’ అందుకోనున్న చిరంజీవి…

  • ఈ ఏడాది రిపబ్లిక్ డే నాడు పద్మ అవార్డులు ప్రకటించిన కేంద్రం
  • చిరంజీవి పద్మ విభూషణ్
  • దేశంలో రెండో అత్యున్నత పౌర పురస్కారం… పద్మ విభూషణ్
  • ఏప్రిల్ 22న ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
  • ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన చిరంజీవి

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి దేశంలోనే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ ప్రకటించారు. ఇటీవల ఏప్రిల్ 22న ఢిల్లీలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మ పురస్కారాలు ప్రదానం చేయగా, చిరంజీవి ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. 

ఈ నేపథ్యంలో, రేపు (మే 9) ఢిల్లీలో జరిగే ఓ కార్యక్రమంలో చిరంజీవి పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి చిరంజీవితో పాటు ఆయన అర్ధాంగి సురేఖ, తనయుడు రామ్ చరణ్, కోడలు  ఉపాసన కూడా హాజరుకానున్నారు.

Related posts

నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద నాటకీయ పరిణామాలు!

Ram Narayana

సీబీఐ కోర్టుకు జగన్ కీలక వినతి…

Ram Narayana

కమ్మ వర్గంలో ఉగ్రవాదులు తయారయ్యారు: అంబటి రాంబాబు

Ram Narayana