Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం ఎంపీ ఎన్నిక … కాంగ్రెస్ ,బీఆర్ యస్ నువ్వా నేనా …

ఖమ్మం పార్లమెంటు ఎన్నికలు రసవత్తరంగా మారాయి… కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా ఉంది వ్యహారం … శనివారం సాయంత్రం ప్రచారం ముగియనుండటంతో జిల్లా అంతటా ప్రచారం హోరెత్తుతోంది …కాంగ్రెస్ తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్తగూడెంలో జరిగిన బహిరంగసభలో పాల్గొనగా , టిఆర్ఎస్ తరఫున ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మం కొత్తగూడెంలో జరిగిన కార్నర్ మీటింగ్లలో పాల్గొని ప్రసంగించారు .ఇరువురు నేతలు కాంగ్రెస్ , బీఆర్ యస్ కార్యకర్తల్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు … జిల్లాకు చెందిన ముగ్గరు మంత్రులు కూడా విస్తృత పర్యటనలు చేశారు…బీఆర్ యస్ తరుపున రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ,ఎమ్మెల్సీ తాతా మధు ,జిల్లాలో పర్యటించగా ,మాజీమంత్రి ఎమ్మెల్యేలు ఆయనియోజకవర్గాల్లో భాద్యతలు చేపట్టారు ..

ఖమ్మం జిల్లా నుంచి రాష్ట్ర క్యాబినెట్లో ముగ్గురు ముగ్గురు మంత్రులు ఉండటంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎన్నిక వారికీ సవాల్ గా మారింది … మొదట ముగ్గురు మంత్రులు తమ తమ కుటుంబ సభ్యులకు టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నించినప్పటికీ అధిష్టానం అందుకు అంగీకరించలేదు … దీంతో కాంగ్రెస్ చెందిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు రఘురాంరెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది…చివరి క్షణాల్లో అభ్యర్థిత్వం ఖరారు కావడంతో కాంగ్రెస్ కొంత వెనకబడినట్లు కనిపించినప్పటికీ నెమ్మదిగా వేగాన్ని పెంచింది… దూకుడుగా వ్యవహరిస్తోంది …ఫలితంగా ప్రత్యర్థి పార్టీలు అధికార కాంగ్రెస్ ముందు ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపించినా , బీఆర్ యస్ కాంగ్రెస్ కు తీసిపోని విధంగా ప్రచారం నిర్వహించింది … లోకసభలో బీఆర్ యస్ పక్ష నాయకుడిగా ఉన్న నామ నాగేశ్వరరావు తిరిగి ఖమ్మం లోకసభకు పోటీ చేయటంతో పోటీ రసవత్తరంగా మారింది… ఖమ్మం నుంచి రెండుసార్లు ఎంపీగా ఎన్నికైన నామ నాగేశ్వరరావు జిల్లాలో విస్తృత పరిచయాలు కలిగి ఉన్నారు …మంచివాడిగా గుర్తింపు ఉంది…లోకసభలో తన వాణిని గట్టిగా వినిపించ గలిగే సత్తా ఉన్నవాడిగా పేరుంది … ఇది ఆయనకు కలిసొస్తుందని ఆ పార్టీ భావి స్తుంది… అంతేకాకుండా ఆయన సామాజిక వర్గానికి చెందిన ఓటర్లంతా ఆయనకి ఓటు వేస్తారని ఆ పార్టీ నమ్ముతుంది… దీంతో నామ గెలుపు పై గంపెడ ఆశలతో బీఆర్ యస్ ఉంది … అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన రామసహాయం రఘురాంరెడ్డి వరంగల్ మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి తనయుడు … మొదటి నుంచి వారిది కాంగ్రెస్ కుటుంబం … రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడిగా రఘురాంరెడ్డికి గుర్తింపు ఉంది … దానికి తోడు ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వియ్యంకుడు కావటం అదనపు అర్హత ….దీంతో ఆయన గెలుపు కోసం శ్రీనివాస్ రెడ్డి అంతా తానై వ్యవహరిస్తున్నారు … అదే సందర్భంలో జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి , విస్తృతంగా పర్యటన చేస్తూ రఘురాంరెడ్డి విజయం కోసం కృషిచేస్తున్నారు .. దీంతో ఆయన ఎన్నిక నల్లేరు మీద నడకే అని అభిప్రాయం ఆ పార్టీ శ్రేణుల్లో వ్యక్తం అవుతుంది…. దానికి తోడు టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండటం గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రోజురోజుకు ఆపార్టీ బలహీనపడుతుండటం తమకు కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తుంది… కాంగ్రెస్ పార్టీలోకి వివిధ పార్టీల నుండి చేరికలు ఇటీవల కాలంలో గణనీయంగా పెరిగాయి .. ప్రత్యేకంగా బిఆర్ బిఆర్ఎస్ నుంచి ఎంపీపీలు, జడ్పిటిసిలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అనేకమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు… ప్రధాన నాయకులంతా కాంగ్రెస్ కు జై కొడుతున్నారు …ఫలితంగా కాంగ్రెస్ గెలుపు ఖాయం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి … అయితే నామా నాగేశ్వరరావు సైతం తమ గెలుపుపై అంతే ధీమాతో ఉన్నారు … ఆయన అన్ని అవకాశాలు వినియోగించుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారు …

ఇక ఇక్కడ గెలుపుపై ఏమాత్రం ఆశలు లేని బీజేపీ ఇప్పటివరకు ప్రజలతో సంబంధంలేని తాండ్ర వినోదరావుకు టికెట్ ఇచ్చింది …తాను గెలవనని ఆయనకు కూడా తెలిసినప్పటికీ బీజేపీకి ఎన్ని ఓట్లు వస్తాయనే లెక్కల కోసం పోటీచేస్తున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి…

Related posts

కాంగ్రెస్ లో టిక్కెట్ల కొట్లాట …అరుపులు కేకలతో దద్దరిల్లిన ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయం

Ram Narayana

ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో భూకబ్జా …రైతు ఆత్మహత్య…

Ram Narayana

కొత్తగూడెంలో వనమా గెలుపు కోసం ఎంపీ వద్దిరాజు బుల్లెట్ పై హల్చల్

Ram Narayana

Leave a Comment