Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఎలక్షన్ కమిషన్ వార్తలు

ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న ఎన్నికల సిబ్బంది…

జనరల్ ఎలక్షన్స్: ఈవీఎంలతో పోలింగ్ కేంద్రాలకు వెళుతున్న ఎన్నికల సిబ్బంది

  • ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు
  • ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్
  • ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సందడి

ఏపీలో రేపు (మే 13) 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్ సభ స్థానాలకు… తెలంగాణలో 17 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. సోమవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. అందుకోసం ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. 

ఈవీఎంలు, తదితర ఎన్నికల సామగ్రిని పంపిణీ చేసేందుకు నిర్దేశించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఎన్నికల సిబ్బంది డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి తమకు కేటాయించిన ఈవీఎంలు, తదితర సామగ్రి తీసుకుని పోలింగ్ కేంద్రాలకు పయనమవుతున్నారు. 

కాగా, సెక్టార్ ల వారీగా సిబ్బందికి ఎన్నికల విధులు కేటాయించారు. పోలింగ్ వేళ అనుసరించాల్సిన విధివిధానాలను అధికారులు సిబ్బందికి వివరించారు. ఇప్పటికే వారికి ఆయా అంశాలపై శిక్షణ ఇచ్చారు.

Related posts

ముగిసిన లోక్ సభ ఐదో విడత పోలింగ్…

Ram Narayana

కౌంటింగ్‌కు ఏపీ సన్నద్ధం.. రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్…

Ram Narayana

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో… ఎగ్జిట్ పోల్స్ ను నిషేధిస్తూ ఈసీ నోటిఫికేషన్ జారీ

Ram Narayana

Leave a Comment