Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

ఖమ్మం పార్లమెంట్ లో పోలైన ఓట్లు 12 లక్షల 41 వేల 135 …76 .09 శాతం

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 16 లక్షల 31 వేల 39 మంది ఓటర్లు ఉండగా ,12 లక్షల 41 వేల 135 …76 .09 శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ..2019 ఎన్నికల్లో 11 లక్షల 39 వేల 848 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు . అంటే 75 .30 శాతం మంది …0 .79 శాతం గత పార్లమెంట్ కన్నా పోలింగ్ శాతం పెరిగింది .. అయితే అర్బన్ ఏరియాలుగా ఉన్న ఖమ్మం , కొత్తగూడెంలలో ఓటింగ్ శాతం బాగా తగ్గింది …ఖమ్మంలో కేవలం 62 .97 శాతం అంటే 2 లక్షల 4 వేల 78 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు …కొత్తగూడెంలో 69 .47 అంటే లక్షా 71 వేల 928 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు… అసెంబ్లీ ,పార్లమెంట్ కు ఒకేసారి ఎన్నికలు జరిగిన 2014 లో 82 .13 శాతం రికార్డు శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం …

చేతి గుర్తా …? కారు గుర్తా …? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు ..

ఎన్నికలు పూర్తీ అయ్యాయి…కౌంటింగ్ కు 20 రోజుల సమయం ఉంది …పోలింగ్ సరళిపై వివిధ రాజకీయ పార్టీలు , అభ్యర్థులు , మంత్రులు , విశ్లేషకులు ,రాజకీయ పండితులు అరా తీస్తున్నారు … లెక్కలు వేసుకుంటున్నారు …గ్రామాల వారీగా వివరాలు సేకరిస్తున్నారు … ఏ ఏ నియోజకవర్గాల్లో మండలాల్లో ఎవరికి అనుకూలంగా ఓట్లు పాలైయ్యాయి …తటస్థ ఓటర్లు ఎటు మొగ్గు చూపారు … కులాలవారీగా ఎవరికీ అనుకూలంగా ఉన్నారు …మొత్తం మీద చేతి గుర్తా …కారు కు జై కొట్టారా ..? ఓటర్లు దేవుళ్ళు ఎవరిని కరుణించారు .. అనే చర్చ జరుగుతుంది … అధికార పార్టీ పై ప్రజల్లో వ్యతిరేకత ప్రభావం ఈ ఎన్నికల్లో ఎంతవరకు చూపింది …బీఆర్ యస్ అభ్యర్థికి సామాజికవర్గం కలిసి వస్తుందా …? బీజేపీ అభ్యర్థికి మోడీ షరిస్మా, అయోధ్యలో రామమందిర నిర్మాణం ఓట్లు రాల్చుతుందా …? అనే చర్చలు జరుగుతున్నాయి….అధికార పార్టీకి జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండటంతోపాటు , సిపిఐ , సిపిఎం , సిపిఐ (ఎం.ఎల్ మాస్ లైన్ ) పార్టీలు టీడీపీ లోని ఒక వర్గం మద్దతు అదనపు అవకాశం … బీఆర్ యస్ అభ్యర్థికి సైతం టీడీపీలోని ఒక వర్గం మద్దతు ఇవ్వగా కమ్మసామాజిక వర్గం ఓట్ల పై నమ్మకం పెట్టుకున్నారు … అయితే ఓటర్లు ఈసారి సైలెంట్ గా ఓటు వేశారు …ఖమ్మం ,కొత్తగూడెం లాంటి నియోజకవర్గాల్లో ఓటింగ్ శాతం బాగా తగ్గింది …రూరల్ ప్రాంతాల్లో ఓటర్లు తమకు నచ్చిన పార్టీకి ఓటు వేసేందుకు ఉచ్చుకత చూపారు …

Related posts

ప్రొద్దుటూరులో ఆత్మహత్య చేసుకున్న ప్రభాకర్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ యస్ నేతలు …

Ram Narayana

ఆ మూడూ వ్యక్తి స్వేచ్ఛనూ హరించే చట్టాలు..సిపిఎం సెమినార్ లో వక్తలు

Ram Narayana

ఖమ్మం జిల్లాలో కలెక్టర్ విపి గౌతమ్ కొత్త ఆలోచన… శాశ్విత ప్రాతిపదికన పోలింగ్ స్టేషన్ల ఆధునికీకరణ..!

Ram Narayana

Leave a Comment