మంత్రి పొంగులేటి దిద్దుబాటు చర్యలు …మీ ముగింటకు మీ ఎమ్మెల్యే పేరుతో పర్యటనలకు శ్రీకారం …
-మాట్లాడుకుందాం రండి సరికొత్త పంథాలో మంత్రి పొంగులేటి
- నాలుగురోజుల పాటు పాలేరు నియోజకవర్గంలో మంత్రి పొంగులేటి పర్యటన
- ఒక్కో రోజు ఒక్కో మండలంలో…
- 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి
- 19న తిరుమలాయపాలెం, 20న కూసుమంచి
- ఆయా మండలాల్లోని ప్రతి గ్రామంలో 20నిమిషాల పాటు సమావేశం
- ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొంగులేటి సరికొత్త పంథా
- పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాలేరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థి గా పోటీచేసి భారీ మెజార్టీతో ఎన్నికైయ్యారు …కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పట్టుదలతోపాటు ఆయన డైనమిజాన్ని చూసి నియోజకవర్గ చరిత్రలో ఎవరికీ రానంత భారీ మెజార్టీ ఓటర్లు ఇచ్చారు … ఆయనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నియోజకవర్గ ప్రజలకు కారణాలు ఏమైనా తమ ఎమ్మెల్యే తమకు దూరంగా ఉంటున్నారని,కూసుమంచిలో క్యాంపు కార్యాలయంలో కూడా ఎవరు అందుబాటులో ఉండటంలేదనే అభిప్రాయాలు నియోజకవర్గంలోని అన్నివర్గాల ప్రజల్లో ఏర్పడ్డాయి …అయితే కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం క్యాబినెట్ లో కీలకమైన రాష్ట్ర రెవెన్యూ ,గ్రహనిర్మాణ , సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి శాఖలకు మంత్రిగా భాద్యతలు స్వీకరించడంతో రాష్ట్ర రాజధానిలో ఉండి వాటిపై అధ్యయనం చేసేందుకు సమయం ఎక్కువ గడిపారు …దీంతో ప్రజల్లో తమ ఎమ్మెల్యే నియోజకవర్గానికి రావడంలేదని గుసగుసలు బయలు దేరాయి… ఇది గమనించిన మంత్రి దిద్దుబాటు చర్యలు పూనుకున్నారు …తనను గెలిపించిన ప్రజల కోర్కెలు తీర్చడం …వారి మనుసులు గెలుచుకోవడం భాద్యతగా భావించారు …అందుకోసం సరికొత్త పంథాలో ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు మీ ఎమ్మెల్యే మీ ముగింటకే అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు … నియోజకవర్గంలో ప్రజలు తమ సమస్యలను చెప్పుకునేందుకు క్యాంపు కార్యాలయానికి వచ్చే అవసరం లేకుండా పాలేరు నియోజకవర్గ ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు ఆయా గ్రామాల్లో పర్యటించనున్నారు. తొలి విడతలో ఈనెల 17 నుంచి 20వ తేదీ వరకు వరుసగా నాలుగు రోజుల పాటు పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఎంపిక చేసిన పలు గ్రామాల్లో పర్యటించేలా ప్రణాళిక రూపొందించుకున్నారు. 17న ఖమ్మం రూరల్, 18న నేలకొండపల్లి, 19న తిరుమలాయపాలెం, 20న కూసుమంచి మండలాల్లో ఆయన పర్యటన సాగనుంది.
- ప్రజల వద్దకే పాలన అనే రీతిలోనే..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచి ప్రజల వద్దకే పాలన అందిస్తామని, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ బాధితులు తిరగాల్సిన అవసరం లేదని చెబుతూ వస్తోంది. ఇదే తరహాలో మంత్రి పొంగులేటి సైతం తనను ఎమ్మెల్యేగా గెలిపించి శాసనసభకు పంపించిన పాలేరు నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోవడానికి ప్రజల వద్దకు వెళ్లేలా నిర్ణయం తీసుకున్నారు. నేరుగా కలిసి.. వారు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను తెలుసుకుని వీలైతే అక్కడికక్కడే పరిష్కారం చూపేలా ప్రణాళిక రూపొందించుకున్నారు.
- ఒక్కో గ్రామంలో ఇరవై నిమిషాలు…
నియోజకవర్గ వ్యాప్తంగా నాలుగు మండలాలు ఉండగా ఒక్కో మండలంలో ముప్పైకి పైగా గ్రామాలున్నాయి. కాగా వాటిలో తొలి విడతలో ప్రతి మండలంలో 15 నుంచి 18 గ్రామాల్లో పర్యటించనున్నారు. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం సైతం స్థానిక ప్రజలతో కలిసి చేసేలా కసరత్తు జరుగుతోంది. ఒక్కో గ్రామంలో ఇరవై నిమిషాల పాటు సమావేశం ఏర్పాటు చేయనున్నారు. ఆ సమావేశంలోనే బాధితుల నుంచి వినతులను స్వీకరించి, సత్వర పరిష్కారం చూపే ప్రయత్నం చేయనున్నారు.
మంత్రిది మంచి ప్రయత్నం…
మంత్రి పొంగులేటి మంచి ప్రయత్నం చేస్తున్నారు …ఆయన పట్ల ప్రజల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించుకునే పని చేయడం హర్షణీయం ….ప్రజల వద్దకు పాలనలాగా ఆయన ఊరూరూ వెళ్లడం అక్కడిక్కడే సమస్యలు పరిష్కరించడంకన్నా ప్రజలకు కావాల్సింది ఏముంటుందని అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి…