Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
బిజినెస్ వార్తలు

అంబానీ, అదానీ, టాటా.. మొదట్లో చేసిన జాబ్​ ఏదో తెలుసా?

  • భారత పతాకాన్ని ప్రపంచ చిత్రపటంపై రెపరెపలాడిస్తున్న భారత సంపన్నులు
  • గోల్డెన్ స్పూన్‌తోనే పుట్టినా తొలుత కిందస్థాయిలో పనిచేసిన వారే
  • రూ. 300 జీతానికి పెట్రోలు బంకులో పనిచేసిన ధీరూభాయ్ అంబానీ

దేశంలోని అత్యంత సంపన్నులైన ముఖేశ్ అంబానీ, రతన్ టాటా, గౌతం అదానీ వంటివారి వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని, వారు ఆ స్థాయికి ఎలా చేరుకోగలిగారని, అసలు వారు మొదట్లో ఏం చేసేవారన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. రతన్ టాటా, ముఖేశ్ అంబానీ వంటివారు గోల్డెన్ స్పూన్‌తోనే పుట్టినప్పటికీ రాత్రికి రాత్రే ఈ స్థాయికి చేరుకోలేదు. వారు కూడా తొలుత చిన్నచిన్న ఉద్యోగాలు చేశారు. ఆయా రంగాల్లో పట్టు సాధించి నేటి స్థాయికి చేరుకుని ప్రపంచం నలుదిశలా భారత ఖ్యాతిని ఇనుమడింపజేస్తున్నారు.

దేశంలోని అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను స్థాపించిన ధీరూభాయ్ అంబానీ తొలుత ఓ పెట్రోలు బంకులో నెలకు రూ. 300 జీతానికి పనిచేశారు. రతన్ టాటా కూడా చిన్నస్థాయి నుంచే తన జీవితాన్ని మొదలు పెట్టారు. తమ కుటుంబానికే చెందిన టాటా స్టీల్ కంపెనీలో ఆపరేషనల్ మేనేజింగ్ ఉద్యోగిగా చేరారు. ఆ తర్వాత టాటా ఇంజినీరింగ్ కంపెనీలో ట్రైనీగా చేరారు. క్రమంగా టాటాల సామ్రాజ్యానికి నేతృత్వం వహించే స్థాయికి చేరుకున్నారు. వీరితో పాటు మరెందరో ఇలా చిన్నస్థాయి నుంచే జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారు. మరి వారెవరో? ఏం చేసేవారూ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే.

Related posts

మీకు ఈ సంగతి తెలుసా… ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డు రూల్స్ మారాయి!

Ram Narayana

చదరపు గజానికి రూ. 29 లక్షలా?.. అపార్ట్​ మెంట్లు ఇంత రేటా?

Ram Narayana

కళ్లు చెదిరే వార్షిక వేతనం అందుకున్న టీసీఎస్ కొత్త సీఈవో…

Ram Narayana

Leave a Comment