వాళ్ల పేర్లు చెప్పాలని కవితపై ఒత్తిడి:ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్
కుట్రలో భాగంగానే కవితను అరెస్టు చేశారని కామెంట్
తీహార్ జైల్లో కవితను కలిసిన ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్
బీజేపీ కి మద్దతివ్వని నాయకుల పేర్లు చెప్పాలని ఎమ్మెల్సీ కవితపై ఈడీ, సీబీఐ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని బీఆర్ యస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తీహార్ జైలులో ఉన్న ఆమెను ఇవాళములాఖత్ ద్వారా కలిశారు. ఈ సందర్భంగా ఆర్ ఎస్పీ మాట్లాడుతూ.. తమకు లొంగని రాజకీయ నాయకుల పేర్లను కవిత ద్వారా చెప్పించి వారిపై కేసులు పెట్టాలని చూస్తున్నారని.. ఈ చర్య అక్రమం, అనైతికం, రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.
అంతకు ముందు ఎమ్మెల్సీ కవితనుబీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు కలిశారు. శుక్రవారం ఉద యం 10 గంటలకు తీహార్ జైలులో ఉన్న కవితతో వీరిద్దరూ ములాఖాత్ అయ్యారు. కుటుంబసభ్యులు కాకుండా ములాఖత్ ద్వారా కలిసిన మొదట వ్యక్తులు వీరే కావడం విశేషం …
అనంతరం తిరిగి ఢిల్లీలోని తెలంగాణ భవన్ కు చేరుకున్నారు. కాగా, గత మార్చిలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనిలాండరింగ్ కేసులో కవితను ఈడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.
ఢిల్లీ రౌస్ ఎవెన్సూ కోర్టు ఆమెకు జుడీషియన్ రిమాండ్ విధించడంతో తీహార్ జైలుకు తరలిం చారు. ఆ తర్వాత జైలులో ఉన్న సమయంలోనే కవితను సీబీఐ అరెస్టు చేసింది.
ప్రస్తుతం ఈ రెండు కేసుల్లో తీహార్ జైలులో ఉన్నారు కవిత. పలుసార్లు బెయిల్ పిటిషన్ వేసిన కోర్టు కొట్టివేసింది. ఈక్రమంలో ఢిల్లీ హైకోర్టు ఈ నెల 24 కవిత బెయిల్ పిటిషన్ పై విచారించనుంది…
============================================