Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలుప్రమాదాలు ...

హర్యానాలో టూరిస్టు బస్సులో మంటలు.. 9 మంది సజీవదహనం..

  • మరో 13 మందికి తీవ్ర గాయాలు.. నూహ్ లో ఘోర దుర్ఘటన
  • మథురలోని బృందావనాన్ని సందర్శించి వస్తుండగా ప్రమాదం
  • ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు

హర్యానాలోని నూహ్ లో శనివారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. కుండ్లీ మానేసర్ పల్వాల్ (కేఎంపీ) ఎక్స్ ప్రెస్ వేపై ఓ టూరిస్టు బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో 9 మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు.

మరో 13 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నల్హార్ మెడికల్ కాలేజీకి తరలించారు. యూపీలోని మథుర నుంచి పంజాబ్ లోని జలంధర్ కు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. మథురలోని బృందావనాన్ని గత వారం సందర్శించిన పంజాబ్, హర్యానాకు చెందిన భక్తులు తిరుగు ప్రయాణం అవుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

బస్సు వెనక భాగంలో మంటలు రావడాన్ని గమనించిన ఓ వాహనదారుడు.. బస్సు డ్రైవర్ ను అప్రమత్తం చేసినట్లు ఓ ప్రయాణికుడు పీటీఐ వార్తాసంస్థకు తెలిపారు.

Related posts

ఇండియా సంపన్నుడిగా మరోమారు గౌతం అదానీ.. ముకేశ్ అంబానీ వెనక్కి!

Ram Narayana

ముగిసిన విస్తారా ఎయిర్ లైన్స్ కథ!

Ram Narayana

రూ.10 నాణెం చలామణిపై సెంట్రల్ బ్యాంక్ మేనేజర్ కీలక ప్రకటన…!

Ram Narayana

Leave a Comment