Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఎట్టకేలకు మేడిగడ్డ పనులు ప్రారంభం…

  • నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు పనులు ప్రారంభం
  • బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు ప్రారంభమైన పనులు
  • ఇప్పటికే ఒక గేటును ఎత్తిపెట్టిన అధికారులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభమయ్యాయి. వర్షాకాలంలో బరాజ్ వద్ద చేపట్టాల్సిన రక్షణ చర్యలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఎల్ అండ్ టీ పనులను ప్రారంభించింది. వరద ప్రవాహాలకు అడ్డంకులు లేకుండా చూడాలని, గేట్లను తెరిచి ఉంచాలని, ప్రవాహానికి ఆటంకం కలిగించే ఇసుకమేటలు, రాళ్లను తొలగించాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు వెంటనే పనులను చేపట్టాలని ఎల్ అండ్ టీ సంస్థకు ఇరిగేషన్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో మేడిగడ్డ బ్లాక్-7లోని 8 గేట్లను ఎత్తివేసేందుకు పనులు ప్రారంభమయ్యాయి.  

8 గేట్లలో ఒక గేటును ఇప్పటికే ఎత్తి పెట్టారు. 2 గేట్లు మినహా మిగిలిన గేట్లను సాంకేతిక ఇబ్బందులు లేకుండానే ఎత్తే అవకాశం ఉందని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. పగుళ్లు ఏర్పడిన 20వ పిల్లర్, దాని పక్కన ఉన్న పిల్లర్ గేట్లను ఎత్తడంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

Related posts

తెలంగాణ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Ram Narayana

టీయూడబ్ల్యూజే (ఐజేయూ ) ఆధ్వరంలో జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ..హెల్త్ కార్డుల కోసం

Ram Narayana

హరీశ్ రావు సహా బీఆర్ఎస్ నేతల అరెస్ట్… పోలీస్ వాహనాలను అడ్డుకున్న కార్యకర్తలు!

Ram Narayana

Leave a Comment