జాతీయ వార్తలు

ఢిల్లీలో ఆప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత… రోడ్డుపై బైఠాయించిన సీఎం కేజ్రీవాల్…

  • బీజేపీ కేంద్ర  కార్యాలయాన్ని ముట్టడించేందుకు ఆప్ నేతల ప్రయత్నం
  • డీడీయూ మార్గ్ లో 144 సెక్షన్ విధించిన పోలీసులు
  • ఆప్ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో కేజ్రీవాల్ నిరసన
  • ఢిల్లీలో బీజేపీ ఆఫీసు వద్ద భారీ బందోబస్తు

ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రధాన కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ కేంద్ర కార్యాలయం వద్దకు వెళ్లేందుకు ఆప్ నేతలు ప్రయత్నించగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. పలువురు ఆప్ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. దాంతో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆప్ కార్యాలయం వద్దనే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు.

 ఆప్ శ్రేణుల కవాతు నేపథ్యంలో, ఢిల్లీ డీడీయూ మార్గ్ లో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఢిల్లీ ఐటీవో మెట్రో స్టేషన్ ను తాత్కాలికంగా మూసివేశారు. అటు, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

దీనిపై ఢిల్లీ సెంట్రల్ డీసీపీ హర్షవర్ధన్ మండవ స్పందించారు. 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఆప్ కార్యకర్తల కవాతును అడ్డుకున్నామని, వెళ్లిపోవాలని సూచించామని స్పష్టం చేశారు. అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని చెప్పారు.

Related posts

700 కోట్ల డ్ర‌గ్ రాకెట్‌లో నిందితుడు.. 12 ఏళ్ల త‌ర్వాత జైలు నుంచి రిలీజ్‌

Ram Narayana

అమెరికాలో పనిచేయాలని కలలు కనే భారతీయ ప్రొఫెషనల్స్‌కు శుభవార్త!

Ram Narayana

నేటి నుంచి నీట్​ పీజీ 2024 రిజిస్ట్రేషన్​.. ఎలా అప్లై చేసుకోవాలంటే..!

Ram Narayana