Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ప్రమాదాలు ...

ఆసుపత్రి ఎమర్జెన్సీ వార్డులోకి దూసుకెళ్లిన పోలీస్ జీప్..

  • డాక్టర్ ను అరెస్ట్ చేయడానికి ఆసుపత్రిలోకి జీప్ లో వెళ్లిన పోలీసులు
  • ఎంట్రెన్స్ లో ఆసుపత్రి సిబ్బంది ఆందోళన
  • రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ఘటన

చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న రోగులకు చికిత్స చేసే ఎమర్జెన్సీ వార్డులోకి పోలీస్ వాహనం ఒకటి దూసుకొచ్చింది. రోగులు పడుకున్న బెడ్లను సెక్యూరిటీ సిబ్బంది పక్కకు జరుపుతుంటే నేరుగా డాక్టర్లు ఉండే క్యాబిన్ వరకు అది చేరుకుంది. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఇది చూసి ఆ జీపులో ప్రాణాల మీదికి వచ్చిన రోగి ఉన్నాడని అనుకుంటే పొరపాటు పడ్డట్లే.. ఆ జీప్ లో పేషెంట్లు ఎవరూ లేరు. మరి ఆసుపత్రి లోపలి దాకా ఆ జీప్ ఎందుకొచ్చిందని అనుకుంటున్నారా.. అక్కడ డ్యూటీ చేస్తున్న నర్సింగ్ ఆఫీసర్ ను అరెస్టు చేసి తీసుకెళ్లడానికి లోపలి దాకా వచ్చింది. రిషికేశ్ లోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చోటుచేసుకుందీ ఘటన. సినిమా సీన్ ను తలపించేలా ఉన్న ఈ వీడియోల వెనకున్న వివరాలు..
 
రిషికేశ్ లోని ఎయిమ్స్  ఆసుపత్రిలో విధినిర్వహణలో ఉన్న తనను నర్సింగ్ ఆఫీసర్ లైంగికంగా వేధించాడని, అసభ్యంగా సైగలు చేస్తూ సందేశాలు పంపించాడని ఓ డాక్టర్ ఆరోపించింది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఎయిమ్స్ లో ఆందోళనలకు దారితీసింది. వైద్యురాలికి మద్దతుగా మిగతా డాక్టర్లు, సిబ్బంది ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. ఈ గొడవపై సమాచారం అందుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ అక్కడ ఆందోళన చేస్తున్న వారంతా పోలీసులను చుట్టుముట్టారు. బాధిత వైద్యురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో నిందితుడిపై నిరసనకారులు దాడి చేసే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు.. తమ వాహనాన్ని నేరుగా ఎమర్జెన్సీ వార్డులోకి తీసుకెళ్లారు. వార్డులోని రోగుల బెడ్స్ ను ఎయిమ్స్ సిబ్బంది పక్కకు జరుపుతుండగా పోలీస్ జీప్ లోపలికి వస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ వాహనం వెంటే లోపలికి చేరుకున్న ఆందోళనకారులను తప్పించుకుంటూ నిందితుడిని అరెస్టు చేసి తీసుకెళ్లారు.

Related posts

గోదావరిలో విహారయాత్ర.. నలుగురు యువకుల గల్లంతు

Ram Narayana

తెలంగాణ సచివాలయం సమీపంలో కారు దగ్ధం

Ram Narayana

కేసీఆర్ జీళ్ళచెర్వు సభకు వెళుతున్న ట్రాక్టర్ బోల్తా ఒకరు మృతి ..పలువురికి గాయాలు …

Ram Narayana

Leave a Comment