Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

మోసాల కాంగ్రెస్ కావాలా …? ప్రజలకోసం నిలబడే బీఆర్ యస్ కావాలా …?హరీష్ రావు

సత్తుపల్లి లో రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టభద్రుల ఓటర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు , నామ నాగేశ్వరరావు, సండ్ర వెంకట వీరయ్య, రాకేష్ రెడ్డి, ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు …

మోసాల కాంగ్రెస్ కావాలా …? ప్రజలకోసం నిలబడే బీఆర్ యస్ కావాలా …?తేల్చుకోవాలా అని మాజీమంత్రి బీఆర్ యస్ సీనియర్ నేత తన్నీరు హరీష్ రావు అన్నారు ..
ఎన్నికల ముందు అలవి కాని హామీలతో ప్రజలను మోసగించి , అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేదని ,అటువంటి పార్టీని శాసన మండలిలో నిలదీయాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించి దీవించా లని పట్టభద్రుల ఓటర్లకు పిలుపు నిచ్చారు .శుక్రవారం సత్తుపల్లిలో రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ పట్టభద్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో హరీష్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు .ఏది ఏమైనా
గెలుపు రాకేష్ రెడ్డి దేనని అన్నారు .ఈ సీటును మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీని గెలుస్తూ వచ్చిందని గుర్తు చేశారు. మేధావులు విజ్ఞాన వంతులు ,ఉద్యోగులు , నిరుద్యోగులు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. రాకేష్ రెడ్డిని గెలిపించడం ద్వారా మొద్దు నిద్ర పోతున్న కాంగ్రెస్ కళ్లు తెరిపించాలనిఅన్నారు .నిరుద్యోగ భృతి, మెగా డీఎస్సీ, రెండు లక్షల ఉద్యోగాలు ఎటు పోయాయని అన్నారు. ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వని కాంగ్రెస్ను ఎన్నికల్లో తరిమి కొట్టాలని అన్నారు రాకేష్ రెడ్డిని గెలిపిస్తేశాసనమండలిలో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి పని చేస్తారని చెప్పారు ….

హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా చేయడంతో పాటు మరో పదేళ్లు ఉమ్మడి రాజధా నిగా చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని, తస్మా జాగ్రత్త అని అన్నారు. హైద రాబాద్ తెలంగాణ ప్రజల హక్కు అని అన్నారు .కెసిఆర్ కు తెలంగాణతో ముడిపడి ఉన్న పేగు బంధమని పేర్కొ న్నారు. కుట్రలు ఛేదించి , తెలంగాణ హక్కులు సాధించాలంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాకేష్ రెడ్డిని గెలిపించాలన్నారు. ఆనాడు కాంగ్రెస్ , బీజీపీ వల్ల
ఖమ్మం జిల్లా లోని ఏడు మండలాలను కోల్పోవటం జరిగిందని చెప్పారు …

ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరరావు మాట్లాడుతూ పుట్టిన గడ్డకు సేవ చేసుకునేందుకు అమె రికాలో ఉన్నతమైన ఉద్యోగం వదులుకొని వచ్చిన రాకేష్ రెడ్డిని గెలిపించుకోవాలని అన్నారు.ఇది అందరి బాధ్యత అని అన్నారు .నీతి నిజాయితీ ఉన్న రైతు బిడ్డ అయిన ఆయ నకు ఆశీస్సులుఇవ్వాలన్నారు. రైతులు, పేదలు, బడుగు బలహీన వర్గాల కష్టాలు తెలిసిన ఆయన గెలిస్తే శాసనమండలిలో క్రియాశీలక పాత్ర పోషిస్తారని అన్నారు. ఈ విషయంలో పట్టబద్రులు, ఉద్యోగులు, మేధావులు అన్ని వర్గాల వారు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. అవతల పోటీ గా వస్తున్న వ్యక్తి కి రాకేష్ ముందు నిలబడే సత్తా లేదని అన్నా రు .కాంగ్రెస్ మోసంతో అధి కారంలోకి వచ్చిందని, అయి దారు నెలల్లో కూడా ఒక హామీని కూడా అమలు చేయలేదని అన్నారు .వడ్లకు రూ 500 బోనస్ ఇస్తామని చెప్పి, ఇప్పుడు మాయ మాటలు చెబుతున్నారని విమర్శించారు .ఆనాడు పార్లమెంట్ లో రైతుల కోసం పోరాటం చేశానని, రైతులు పండించిన పంట మొత్తం కొనుగోలు చేయాలని పార్లమెంట్ లోపల, బయట పోరాటం చేసి పార్లమెంటును స్తంభింప చేసినట్లు చెప్పారు. ఆ రోజు కాంగ్రెస్ బిజెపిలను మద్దతు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదని అన్నారు .
ప్రశ్నించే గొంతుక రాకేష్ రెడ్డిని గెలిపిస్తే శాసనమండలిలో తెలంగాణ హక్కులు సాధిస్తా రని చెప్పారు .

  అభ్యర్ది రాకేష్ రెడ్డి మాట్లాడుతూ మీ సేవ కోసం... నిరుద్యోగుల భవితవ్యం కోసం వచ్చిన తనను ఆశీర్వదించా లని కోరారు. తనను గెలిపిస్తే పైసా జీతం తీసుకోకుండా వచ్చిన సొమ్ముతో సహాయ నిధిని ఏర్పాటు చేసి, నిరుద్యో గులను ఆదుకుంటామని చెప్పారు.
 ఇంకా ఈ సమావేశంలో 

పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డి ,ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు ,
పురుషోత్తంరెడ్డి, ఉమా మహేశ్వరరావు ,మహేష్ తదితరులు పెద్ద ఎత్తున పట్టభద్రులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణలో వారికి మాత్రమే భద్రత ఉంది: రఘునందనరావు రీట్వీట్

Ram Narayana

మంత్రి సురేఖమ్మను చుట్టుముడుతున్న వివాదాలు…

Ram Narayana

మహబూబ్‌నగర్‌లో బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్ ఖాతాలోకి డీసీసీబీ

Ram Narayana

Leave a Comment