Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కసరత్తు …మరో ఆరుగురు మంత్రులు !

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. చాలా రోజులుగా ఆశావాహులు నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ పైన అడుగులు పడుతున్నాయి. జూలై, ఆగస్టులోనే పంచాయితీ ఎన్నికల నిర్వహణ దిశగా కసరత్తు జరుగుతోంది. దీంతో, తన మంత్రివర్గ విస్తరణ పూర్తి చేయాలని రేవంత్ భావిస్తున్నట్లు సమాచారం. అందులో భాగంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి తరువాత తన మంత్రివర్గ విస్తరణకు వీలుగా రేవంత్ హైకమాండ్ అనుమతి తీసుకున్నట్లు తెలుస్తోంది.

పంచాయితీ ఎన్నికలకు ముందే మంత్రివర్గ విస్తరణ ..నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తి చేయనున్నారు. జూన్ 4న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూన్ ద్వితీయార్ధంలో మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ లో సీఎంతో సహఆ 12 మంది ఉన్నారు. మరో ఆరుగురికి ఛాన్స్ ఉంది.ప్రస్తత కేబినెట్ లోహైదరాబాద్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేలు ఎవరు లేరు. బీఆర్ఎస్ నుంచి ఎవరైనా వస్తే వారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల పనితీరు ఆధారంగా పదవులు ఉంటాయని గతంలో కాంగ్రెస్ ముఖ్యనేతలు చెప్పుకొచ్చారు.

అనూహ్యంగా ఎంపిక ఛాన్స్ దక్కేదేవరికి ?

ఛాన్స్ దక్కేదెవరికి కొత్తగా ఛాన్స్ ఆశిస్తున్న వారిలో రంగారెడ్డి జిల్లా నుంచి పరిగి ఎమ్మెల్యే రామ్‌మోహన్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ రేసులో ఉన్నారు. నిజామాబాద్, అదిలాబాద్ జిల్లాలకు ఈ సారి మంత్రివర్గంలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. ఆదిలాబాద్‌ నుంచి గడ్డం వినోద్, వివేక్‌ సోదరుల మధ్యే మంత్రి పదవికి పోటీ నెలకొంది. ఇద్దరూ దిల్లీలో అగ్రనేతలను కలిసినట్లు తెలుస్తోంది. తనకు అవకాశం ఇస్తారని వివేక్‌ ధీమాతో ఉన్నారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు కూడా ప్రయత్నిస్తున్నారు. కీలకమైన హోం శాఖ ఎవరికైనా అప్పగిస్తారా లేక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వద్దనే ఉంచుకుంటారా అనే చర్చ కూడా సాగుతోంది. కడియం శ్రీహరి కి ఛాన్స్ ఇస్తారా ..లేదా అనే చర్చ జరుగుతుంది ….అయితే గడ్డం వినోద్ , వివేక్ లు ఉన్నందున ఛాన్స్ ఉండక పోవచ్చునని అంటున్నారు …అయితే మాదిగ సామాజికవర్గానికి చోటు ఇవ్వకపోతే ఇప్పటకే ఆవర్గాలలో ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంది ..

క్యాబినెట్ లోకి యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ కు ఛాన్స్ ఖాయంగా కనిపిస్తోంది. ఈ మేరకు ఢిల్లీ పెద్దల నుండి హామీ దక్కినట్లు సమాచారం. యువకులకు మంత్రివర్గంలో పీట వేయాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా కేసి వేణుగోపాల్ నుండి మైనంపల్లి రోహిత్ కు ఫోన్ వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి వర్గంలో చోటు లభిస్తే అతిపిన్న వయస్కుడిగా రోహిత్ రికార్డ్ సృష్టించనున్నారు. ఈ క్రమంలోనే వందకుపైగా ఉన్న నామినేటెడ్‌ పోస్టుల భర్తీ కోసం త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కసరత్తు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

Related posts

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ బతకనీయదు… కేసీఆర్

Ram Narayana

కాంగ్రెస్ పార్టీలో చేరిన మైనంపల్లి హన్మంతరావు, వేముల వీరేశం, కుంభం అనిల్

Ram Narayana

మేడిగడ్డను పరిశీలించిన రాహుల్‌గాంధీ.. దోపిడీని చూసేందుకే వచ్చానన్న కాంగ్రెస్ అగ్రనేత

Ram Narayana

Leave a Comment