Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ రాజకీయ వార్తలు ..

ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఎం అవుతారు: రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్య

కాంగ్రెస్ జోతిష్యుడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ..ఉత్తమ్ సీఎం అవుతారంట …
మునుగోడు ఉపఎన్నికల్లో గెలవాలని కోరుకోలేదు అనే సందేహాలు

  • నల్గొండ ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారన్న రాజగోపాల్ రెడ్డి
  • మున్ముందు ముఖ్యమంత్రి అవుతారని వ్యాఖ్య
  • తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, చెప్పింది జరుగుతుందన్న ఎమ్మెల్యే

మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని జోస్యం చెప్పారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నీటి పారుదల పనులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సమావేశంలో రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… నల్గొండ ప్రజల ఆశీస్సులతో ఉత్తమ్ మంత్రి అయ్యారన్నారు. మున్ముందు ఆయన తప్పకుండా సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. తన నాలుకపై పుట్టుమచ్చలు ఉన్నాయని, తాను ఏది చెప్పినా తప్పకుండా జరుగుతుందన్నారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ, బునాదిగాని పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాల్వను రీడిజైన్ చేయాలని కోరారు. ఈ కాల్వ వెడల్పును పెంచాలన్నారు. దీంతో ఆయకట్టు కూడా రెండింతలు అవుతుందన్నారు. అధికారులు దూరదృష్టితో ప్రతిపాదనలు పంపాలని ఎమ్మెల్యే సూచించారు.

Related posts

తెలంగాణాలో కాంగ్రెస్ కు 8 – బీజేపీకి 8 ఎంపీ సీట్లు

Ram Narayana

ప్రొఫెసర్ జయశంకర్‌ను కేసీఆర్ క్షోభపెట్టారు.. ప్రొఫెసర్ కోదండరాం

Ram Narayana

ఎన్నికల్లో మనతో ఉన్నోడే మనోడు…అవకాశవాదులు పార్టీలో స్థానంలేదు…సీఎం రేవంత్ రెడ్డి

Ram Narayana

Leave a Comment