Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

తెలంగాణ, ఏపీలలో బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో అంచనా వేసిన యోగేంద్ర యాదవ్…

  • తెలుగు రాష్ట్రాల్లో గతంలో కంటే సీట్లు పెరుగుతాయని అంచనా
  • దక్షిణాదిన బీజేపీకి 13 సీట్లు పెరగవచ్చునని అంచనా
  • కర్ణాటకలో సగానికంటే ఎక్కువ సీట్లు బీజేపీ నష్టపోవచ్చునన్న యోగేంద్ర యాదవ్

లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటుందని… తెలుగు రాష్ట్రాల్లో, దక్షిణాదిన తన బలం పెంచుకుంటుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ అంచనా వేశారు. ఆయన అంచనాల ప్రకారం దక్షిణ, తూర్పు భారతంలో బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే అది బీజేపీ అంచనాల కంటే తక్కువగానే ఉంటాయని చెబుతున్నారు.

తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్యనే పోరు కనిపిస్తోంది. ఇక్కడ ఈ రెండు పార్టీలకు సీట్లు పెరుగుతాయని… బీజేపీ సీట్లు గతంలో కంటే నాలుగు వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో క్రితంసారి బీజేపీకి ఒక్క సీటు కూడా లేదు. ఇప్పుడు పొత్తు కారణంగా మూడు సీట్లు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. మిత్రపక్షాలు 12 సీట్లు పెంచుకోవచ్చునని అంచనా వేస్తున్నారు.

ఒడిశాలో ప్రస్తుతం ఉన్న 8 సీట్లకు మరో నాలుగు జత కలిసే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. కర్ణాటక మినహా, దక్షిణాదిన బీజేపీకి 13 సీట్లు పెరగవచ్చునని యోగేంద్ర యాదవ్ అంచనా వేస్తున్నారు. మిత్రపక్షాలు మరో 14 సీట్లు అదనంగా గెలుచుకోచ్చునని చెబుతున్నారు. కర్ణాటకలో మాత్రం బీజేపీ 13 సీట్లను కోల్పోయి 12కు పరిమితం కావొచ్చునని అంచనా వేశారు.

Related posts

అన్ని వైద్య కళాశాలల్లోఈడబ్ల్యూఎస్‌ కోటా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాల్సిందే …

Ram Narayana

బీహార్ నుంచి మటన్ తెప్పించి, స్వయంగా వండి రాహుల్ కు విందు ఇచ్చిన లాలూ

Ram Narayana

2024 ఎన్నిలకల్లో బీజేపీకి 300 సీట్లు …మళ్ళీ ప్రధాని మోడీనే …అమిత్ షా …

Drukpadam

Leave a Comment