Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
రాజకీయ వార్తలు

కొనసాగుతున్న రఘురామ రచ్చ …

కొనసాగుతున్న రఘురామ రచ్చ …
తన ఫోన్ సి ఐ డి దగ్గరే ఉందన్న రఘురామ దానినుంచి కాల్స్ వెళుతున్నాయి
ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు
రఘురామ మాకు ఒకటి ,ఢిల్లీ పోలీసులకు మరొక ఫోన్ నెంబర్ చెప్పారంటున్న సి ఐ డి
ఢిల్లీ పోలీసులకు చెప్పిన నెంబరుకు తేడా ఉంది: ఏపీ సీఐడీ
తన ఫోన్ ను సీఐడీ అధికారులు తీసుకున్నారన్న రఘురామ
ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు
స్పందించిన ఏపీ సీఐడీ అధికారులు
విచారణలో రఘురామ ఒక ఫోన్ నెంబరు చెప్పినట్టు వెల్లడి
ఢిల్లీ పోలీసులకు మరో నెంబరు చెప్పారని ఆరోపణ
దేశద్రోహం కేసులో బెయిల్ పై ఉన్న రఘురామ రచ్చ కొనసాగుతుంది…. ఆయనకు సుప్రీం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆయనపై సి ఐ డి అధికారులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని కోర్టుకు తెలపడం కోర్ట్ వారు ముందు గుంటూరు జి జి ఎం లో పరీక్షలు జరిపించారు. తరువాత సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స జరిగింది. అక్కడ ఆయన దెబ్బల ఆరోపణలపై పరీక్షలు జరిగాయి. కచ్చితంగా సి ఐ డి ఆయనపై దాడి చేసి గాయపరిచారని కచ్చితమైన నివేదికలు లేవు…. ఆయన మాత్రం తనపై ఏపీ సి ఐ డి థర్డ్ డిగ్రీ ప్రయోగించిందని వాదనను బలంగా వినిపిస్తున్నారు. ఇప్పటికే తనకు జరిగిన అన్యాయం పై ఆయన పార్లమెంట్ సభ్యులకు లేఖలు రాశారు. తాజాగా తనపై పెట్టిన సెక్షన్ తొలగించాలని పార్లమెంట్ లో పట్టు పట్టాలని ఢిల్లీ ముఖ్యమంతి అరవింద్ కేజ్రీవాల్ కు లేఖ రాశారు…
ఫోన్ వ్యవహారంలో ఏపీ సి ఐ డి వివరణ ఇచ్చింది …….
తన ఐఫోన్ ను బలవంతంగా అన్ లాక్ చేయించారని, తన ఫోన్ ను దుర్వినియోగం చేస్తున్నారని ఎంపీ రఘురామకృష్ణరాజు ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలిస్ కు ఫిర్యాదు చేయడం తెలిసిందే. అయితే, ఫోన్ విసయంలో రఘురామ చేస్తున్న ఆరోపణలపై ఏపీ సీఐడీ అధికారులు స్పందించారు.

రఘురామ వాడుతున్నది ఆపిల్ 11 ఐఫోన్ అని అధికారులు వెల్లడించారు. మే 15న ఆయన నుంచి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నామని తెలియజేశామని వివరించారు. ఆ ఫోన్ లో ఉన్న నెంబరును ఇద్దరు సాక్షుల ముందు రఘురామ చెప్పగా, ఆ మేరకు స్టేట్ మెంట్ కూడా నమోదు చేశామని తెలిపారు. ఆ మేరకు సీఐడీ కోర్టుకు ఫోన్ స్వాధీనంపై సమాచారం అందించామని చెప్పారు.

కానీ, రఘురామ ఇప్పుడు దర్యాప్తు సంస్థలను తప్పుదారి పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని ఏపీ సీఐడీ అధికారులు పేర్కొన్నారు. రఘురామ తన ఫోన్ నెంబరు అంటూ ఢిల్లీ పోలీసులకు ఓ నెంబర్ ను చెప్పారని, ఆ నెంబరు మీడియాలో కూడా వచ్చిందని, అయితే, విచారణ సందర్భంగా తమకు చెప్పిన ఫోన్ నెంబరు మరొకటి అని వారు స్పష్టం చేశారు. మే 15న తాము నమోదు చేసిన రఘురామ స్టేట్ మెంట్ కు, ఢిల్లీ పోలీసులకు చేసిన ఫిర్యాదుకు తేడా ఉందని సీఐడీ అధికారులు వివరించారు.

కాగా, రఘురామ ఐఫోన్ ను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ విభాగానికి పంపిచామని, ఆయన ఫోన్ డేటాను గత నెల 31న కోర్టుకు కూడా సమర్పించామని సీఐడీ అధికారులు తెలిపారు.

Related posts

ఖమ్మంలో బీఆర్ఎస్ సభపై రేవంత్ రెడ్డి స్పందన!

Drukpadam

రాజకీయాల్లో మార్పుకోసం పీకే పాదయాత్ర …జనం లేక వెలవెల …

Drukpadam

Drukpadam

Leave a Comment