నర్సింగ్ విద్యార్థిని కారుణ్య మృతిపై న్యాయ విచారణ జరపండి..మావోయిస్టుల సంచలన లేఖ
కారుణ్య మృతికి కళాశాల యజమాని కాంతారావు భాద్యత వహించాలి
గతంలో జరిగిన మరణాలపై కూడా విచారణ జరగాలి
ఫీజుల పేరుతో తల్లిదండ్రుల రక్తమాంసాన్ని పీల్చడం ఆపకపోతే చర్యలు తప్పవని హెచ్చరిక …
భద్రాచలంలో బీఎస్సీ నర్సింగ్ కళాశాలలో చదువుతున్న కారుణ్య అనే విద్యార్ధి మృతిపై మావోయిస్టు పార్టీ అనుమానం వ్యక్తం చేసింది …బాతురూమ్ కు వెళ్లిన కారుణ్య ఎలా చనిపోయిందనేది మిస్టరీగా ఉందని అందువల్ల విద్యార్ధి మరణంపై న్యాయవిచారణ జరపాలని బీకేఏఎస్ఆర్ డివిజన్ కార్యదర్శి ఆజాద్ పేరిట లేఖ విడుదల అయింది …దీంతో ఇది సంచలనంగా మారింది …మావోయిస్టుల లేక వచ్చిందనే విషయం మీడియా ద్వారా తెలియడంతో భద్రాచలంలో కలకలం బయలుదేరింది ..ఆ లేఖలో మారుతి పారామెడికల్ కళాశాల యాజమాన్యంపై మావోయిస్టు పార్టీ ఆగ్రహం ప్రకటించింది …
కారుణ్య మృతికి కళాశాల కరస్పాండెంట్ కాంతారావు బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్న మావోయిస్టు పార్టీ …కారుణ్య మృతి ఘటనతో పాటు గతంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన కళాశాల విద్యార్థులు అమన్ సహా మరో ఇద్దరు విద్యార్థినుల మృతిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసింది ..
ఫీజుల పేరిట నర్సింగ్ కళాశాల యాజమాన్యం విద్యార్థులు, తల్లిదండ్రుల రక్తం తాగుతున్నారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేస్తూ లేఖలో పేర్కొన్నది ..ఏజెన్సీప్రాంతంలో విద్యను వ్యాపారంగా మలుచుకుని కోట్లకు పడగనెత్తిన కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది ..భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతమైనా విద్య పేరిట దోపిడీకి పాల్పడిన మారుతి నర్సాంగ్ కళాశాల యాజమాన్యం ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరిక చేసింది ..