త్వరలో అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు …రెవెన్యూ మంత్రి పొంగులేటి
కొత్త పెన్షన్లు అందిస్తామన్న మంత్రి
ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసితీరతామన్న మంత్రి
ఇల్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇల్లు
రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న దరఖాస్తుదారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుంచో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందజేయడం జరుగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన ఆరు వాగ్దానాలు అమలు దిశగా వేసిన అడుగులను మంత్రి పంచుకున్నారు … రైతుల రుణమాఫీ , మహిళలకు 2500 పెన్షన్ లాంటి వాటిని అమలు చేసి తీరతామని అన్నారు …రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పటికీ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలుకు వెనకాడబోమన్నాయి పేర్కొన్నారు ..తమపై ఎన్ని ఆశలు పెట్టుకొని ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లు ఇచ్చి అధికారంలోకి తెచ్చారని వారి ఆశలు అడియాశలు కనివ్వబోమని మంత్రి అన్నారు .. వరస ఎన్నికల వల్ల రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో కొత్త వెనకపట్టు పట్టినమాట వాస్తవమేనని ఎన్నికల కోడ్ ముగియగానే పరుగులు పెట్టిస్తామని అన్నారు …ప్రజల మేలుకోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని అందుకు అనుగుణంగా ముందుకు సాగుతామని మంత్రి స్పష్టం చేశారు ..
ఈ విషయాన్ని మంత్రి ఎక్స్(ట్విట్టర్) లో పోస్ట్ చేశారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఈ మేరకు మంత్రి ప్రకటించారు. అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని పేర్కొన్నారు. స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణమాఫీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా 6 గ్యారంటీలు అమలు చేసి తీరుతామని ఎక్స్ వేదికగా మంత్రి పొంగులేటి ట్వీట్ చేశారు.