ఏపీ లో జగన్ కు 50 శాతం …ఎన్డీయే కూటమికి 46 శాతం …పార్థదాస్ చాణక్యయ సర్వే
వైసీపీ 110 -120 సీట్లు …టీడీపీకుటమి 55 -65 సీట్లు
ఏపీలో జగన్ కు జై కొట్టిన మహిళా ఓటర్లు … 12 శాతం అధికం
చంద్రబాబు కూటమికి జైకొట్టిన పురుష ఓటర్లు 4 శాతం అధికం
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశం యావత్తు ,ఎన్నారైలు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న ఏపీ ఎగ్జిట్ పోల్స్ సర్వే లో షఫాలజిస్టు పార్థదాస్ చాణక్యయ సర్వే ప్రకారం వైసీపీ 50 శాతం ఓట్లతో 110 -120 సీట్లు టీడీపీ కూటమికి 46 శాతం ఓట్లతో 55 -65 సీట్లు వస్తాయని అంచనా వేసింది ..కాంగ్రెస్ ,వామపక్షాల కూటమికి 2 .5 శాతం ఓట్లు , ఇతరులకు 1 .5 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది …. టీడీపీ కూటమికి పురుష ఓట్లర్లు 4 శాతం అధికంగా ఓట్లు వేయగా , చంద్రబాబు కూటమికి మహిళలు 12 శాతం అధికంగా ఓట్లు వేసినట్లు ఆ సర్వే తెలిపింది …