Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఖమ్మం వార్తలు

తెలంగాణ ఇచ్చింది…. తెచ్చింది కాంగ్రెస్సే..!

  • అమరవీరుల త్యాగఫలితం ప్రత్యేక రాష్ట్రం
  • బీఆర్ఎస్ హయంలో కలలు కలలుగానే మిగిలాయి…
  • కాంగ్రెస్ ప్రభుత్వంలో వాటన్నింటిని సాకారం చేస్తాం…
  • అవతరణ వేడుకల్లో రామసహాయం రఘురాం రెడ్డి, రాయల నాగేశ్వరరావు

తెలంగాణ ఇచ్చింది… తెచ్చింది కాంగ్రెస్సేనని, ఆనాడు తెలంగాణ కోసం ఎంతోమంది అమరవీరులు ప్రాణత్యాగం చేసుకుంటూ ఉంటే చలించిపోయి ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేసిన ఘనత సోనియాగాంధీకి దక్కుతుందని ఖమ్మం పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలోని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయంలో రఘురాం రెడ్డి, కూసుమంచిలోని క్యాంపు కార్యాలయంలో రాయల నాగేశ్వరరావు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతీయ జెండాను ఎగుర వేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో రఘురాం రెడ్డి, కూసుమంచిలో రాయల నాగేశ్వరరావు మాట్లాడుతూ…. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క కల కూడా నెరవేరలేదన్నారు. బీఆర్ఎస్ హయంలో అన్ని వర్గాల వారి కలలు కలలుగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం, జూన్ 4వ తేదీన కేంద్రంలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో అవి సాకారం అవుతాయన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెచ్చుకున్న ఈ తెలంగాణలో వాటన్నింటిని కాంగ్రెస్ ప్రభుత్వం నిజం చేసి చూపిస్తుందని స్పష్టం చేశారు. ఎవరూ అధైర్యపడొద్దని ప్రతి ఒక్కరి కలను సాకారం చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వనిదని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, టీపీసీసీ సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్, కార్పొరేటర్లు దొడ్డా నగేష్ యాదవ్, మలీదు జగన్, రఫీదా బేగం, నాయకులు ముస్తఫా, కొప్పెర ఉపేందర్, మందడపు తిరుమలరావు, కృష్ణమూర్తి, మియాభాయ్, కొంగర జ్యోతిర్మయి, కూసుమంచి ఎంపీపీ శ్రీనివాస్, మట్టె గురవయ్య, మాదాసు ఉపేందర్, జొన్నలగడ్డ రవి, బజ్జూరి వెంకట్ రెడ్డి, సూర్యనారాయణ రెడ్డి, జూకూరి గోపాలరావు, బారి వీరభద్రం, ఇంటూరి పుల్లయ్య, చంద్రమోహన్, వెంకటరత్నం, శాఖమూరి రమేష్, కొడాలి గోవిందరావు, అజ్మీరా అశోక్ నాయక్, కొప్పుల చంద్రశేఖర్, బోడా శ్రావణ్, తమ్మినేని నవీన్, ఏనుగు మహేష్, ఉత్తేజ్, స్వరూప, శ్రీ కళా రెడ్డి, కర్లపూడి భద్రకాళి, తిరుపతమ్మ, వేములసీత, చంద్రు నాయక్, కానుగుల రాధాకృష్ణ, చల్లా రామకృష్ణ రెడ్డి, తాళ్లూరి రాము, జిలానీ, మొగిలిచర్ల సైదులు, కాంపాటి రమేష్, తోట ప్రసాద్, రమాదేవి, ఎయిర్ టెల్ నరసింహారావు, ఎ.వి.నాగేశ్వరరావు, నాగరాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రాకేష్ రెడ్డిని గెలిపించండి ..ఎంపీ వద్దిరాజు …

Ram Narayana

ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్రకు పెరుగుతున్న ఆదరణ …

Ram Narayana

ఖమ్మం జిల్లా వార్తలు ……

Drukpadam

Leave a Comment