ఆంధ్రప్రదేశ్ రాజకీయవార్తలు

జగన్ గెలుస్తాడన్న నా అంచనా తప్పింది: వేణుస్వామి

మోదీపై నేను చెప్పింది నిజమైంది…

  • దేశంలో మోదీ ప్రభావం తగ్గుతుందని చెప్పాను… అలాగే జరిగిందన్న వేణుస్వామి
  • పోటీ చేసిన వారి జాతకాన్ని బట్టి ఫలితాలను చెప్పానని వెల్లడి
  • ఏపీలో నేను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నానన్న వేణుస్వామి

లోక్ సభ ఎన్నికల్లో తన అంచనాలు నిజమయ్యాయని… ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం తన లెక్క తప్పిందని ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి అన్నారు. ఈ మేరకు ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. దేశంలో ప్రధాని మోదీ ప్రభావం తగ్గుతుందని తాను చెప్పానని… అది నిజమైందని పేర్కొన్నారు. కానీ ఏపీలో మాత్రం జగన్ విజయం సాధిస్తారని చెప్పానని… కానీ తన అంచనాలు తప్పాయన్నారు.

తాను చెప్పిన రెండింట్లో ఒకటి నిజమైందని… మరొకటి లెక్క తప్పిందన్నారు. తనకున్న పరిజ్ఞానం, విద్యను అనుసరించి తాను అభిప్రాయాలను వెల్లడించానన్నారు. పోటీ చేసిన వారి జాతకం ఆధారంగా చేసుకొని తాను ఫలితాలను చెప్పానని అన్నారు. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ విషయంలో తాను చెప్పింది వంద శాతం తప్పని అంగీకరిస్తున్నానని పేర్కొన్నారు.

Related posts

ఇది బాబు భజన.. అన్నీ తప్పుడు లెక్కలే: ఏపీ బడ్జెట్‌పై జగన్ విమర్శలు..

Ram Narayana

జోగి రమేశ్ ఇంటిపై దాడి కేసు.. 11 మంది టీడీపీ నేతల అరెస్ట్…

Ram Narayana

ఏపీసీసీ చీఫ్ గా షర్మిల భాద్యతలు … చంద్రబాబు ,జగన్ లపై బాణాలు …

Ram Narayana