Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

చంద్ర‌బాబును క‌లిసిన స్టాలిన్‌

  • ఢిల్లీ విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబుతో స్టాలిన్ భేటీ
  • ఈ విష‌యాన్ని ‘ఎక్స్’ ద్వారా తెలియ‌జేసిన త‌మిళ‌నాడు సీఎం
  • కేంద్రంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని న‌మ్మ‌కం ఉందంటూ ట్వీట్‌

త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి ఎంకే స్టాలిన్ బుధ‌వారం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించింనందుకు బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. “ఢిల్లీ విమానాశ్ర‌యంలో త‌లైవ‌ర్ క‌లైంగ‌ర్ కరుణానిధికి చిర‌కాల మిత్రుడు చంద్ర‌బాబును క‌లిశాను. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం. కేంద్రంలో ఆయ‌న కీల‌క‌పాత్ర పోషిస్తార‌ని నాకు న‌మ్మ‌కం ఉంది. ద‌క్షిణాది రాష్ట్రాల కోసం పోరాడుతూ మ‌న హ‌క్కుల‌ను కాపాడ‌తార‌ని విశ్వ‌సిస్తున్నా” అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఇండియా కూటమి స‌మావేశం కోసం స్టాలిన్ ఢిల్లీ వెళ్లారు. అలాగే చంద్ర‌బాబు కూడా ఎన్‌డీఏ మిత్ర‌ప‌క్షాల భేటీ కోసం ఢిల్లీ వెళ్ల‌డం జ‌రిగింది.


Related posts

బీజేపీ నేత చెప్పిన సమాధానం విని ఆశ్చర్యపోయాను: అరవింద్ కేజ్రీవాల్

Ram Narayana

సీబీఐ డైరెక్టర్ కూడా బీజేపీ టికెట్‌పై బరిలోకి దిగుతారామో?.. టీఎంసీ నేత మహువా మొయిత్రా ఎటాక్

Ram Narayana

బీజేపీ మా సైద్ధాంతిక విరోధి… డీఎంకే మా రాజకీయ ప్రత్యర్థి: హీరో విజయ్ తొలి రాజకీయ ప్రసంగం..

Ram Narayana

Leave a Comment