Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

టీడీపీ దాడులతో భయానక వాతావరణం నెలకొంది.. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి: వైఎస్ జ‌గ‌న్

  • వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయిందన్న జ‌గ‌న్‌
  • అధికార పార్టీ ఒత్తిళ్ల‌కు పోలీసు వ్య‌వ‌స్థ నిస్తేజంగా మారిందని వ్యాఖ్య‌
  • ఐదేళ్లుగా ప‌టిష్ఠంగా ఉన్న శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయ‌ని ఆవేద‌న‌ 

టీడీపీ దాడులు చేస్తోందని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి ట్వీట్ చేశారు. ప్ర‌భుత్వం ఏర్పాటు కాక‌ముందే టీడీపీ ముఠాలు స్వైర‌విహారం చేస్తున్నాయ‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంద‌ని జ‌గ‌న్ త‌న‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. 

“స‌చివాల‌యాలు, ఆర్బీకేల్లాంటి ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ ఆస్తుల‌ను ధ్వంసం చేస్తున్నారు. వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌కు ర‌క్ష‌ణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్ల‌కు పోలీసు వ్య‌వ‌స్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా ప‌టిష్ఠంగా ఉన్న శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా దెబ్బ‌తిన్నాయి. గ‌వ‌ర్న‌ర్ వెంట‌నే జోక్యం చేసుకుని ప‌చ్చ‌మూక‌ల అరాచ‌కాల‌ను అడ్డుకోవాలి. ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్‌ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం” అని జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Related posts

అహ్మ‌దాబాద్‌లో అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాల‌ను త‌ల‌ద‌న్నేలా రైల్వే స్టేష‌న్‌…

Drukpadam

చీరకట్టుకున్న వారికి అనుమతి లేదన్న రెస్టారెంట్ మూసివేత!

Drukpadam

జగన్ ఆస్తుల కేసు నుంచి తనను తొలగించాలన్న వైవీ సుబ్బారెడ్డి పిటిషన్ పై విచారణ…

Drukpadam

Leave a Comment