Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
అంతర్జాతీయం

డెన్మార్క్ ప్రధానిపై దాడిని ఖండించిన మోదీ…

  • డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై ఆగంతుకుడి దాడి
  • ప్రధానిని మరో ప్రాంతానికి తరలించిన భద్రతా సిబ్బంది
  • దాడికి పాల్పడిన వ్యక్తి అరెస్ట్
  • ఇలాంటి దాడులను సమర్థించబోమన్న భారత ప్రధాని మోదీ

డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి జరిగింది. డెన్మార్క్ రాజధాని కోపెన్ హేగెన్ నగరంలోని కుల్టోర్వెట్ స్క్వేర్ వద్ద ఓ దుండగుడు అకస్మాత్తుగా ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఫ్రెడరిక్సన్ దిగ్భ్రాంతికి గురయ్యారు. 

ఈ దాడి జరిగిన వెంటనే ప్రధానిని భద్రతా సిబ్బంది మరో ప్రాంతానికి తరలించారు. దాడికి పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డెన్మార్క్ ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ కు ఏమైనా గాయాలయ్యాయా అనే అంశంపై స్పష్టత లేదు. 

కాగా, ఈ దాడి ఘటనను భారత ప్రధాని నరేంద్ర మోదీ ఖండించారు. డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్సన్ పై దాడి తీవ్ర ఆందోళన కలిగించిందని వెల్లడించారు. ఇలాంటి దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించబోమని మోదీ స్పష్టం చేశారు. మిత్రురాలు మెట్టే ఫ్రెడరిక్సన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు ట్వీట్ చేశారు.

Related posts

భారత్ కొన్ని లక్షల మందిని కష్టాలపాలు చేస్తోంది..కెనడా ప్రధాని ఆరోపణ

Ram Narayana

ఇండియా-బంగ్లాదేశ్ వార్మప్ మ్యాచ్‌లో హైడ్రామా సీన్.. మైదానంలోకి పోలీసుల ఎంట్రీ…

Ram Narayana

పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేయడంపై స్పందించిన భారత్

Ram Narayana

Leave a Comment