జాతీయ రాజకీయ వార్తలు

నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసింది, కానీ…: జేడీయూ

  • నితీశ్ కుమార్ ఆఫర్‌ను తిరస్కరించారన్న జేడీయూ
  • ప్రస్తుతం తాము ఎన్డీయేలోనే కొనసాగుతున్నట్లు స్పష్టీకరణ
  • జేడీయూ నేత త్యాగి వెల్లడి

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు ఇండియా కూటమి ప్రధాని పదవిని ఆఫర్ చేసినట్లుగా జేడీయూ వర్గాలు వెల్లడించాయి. అయితే నితీశ్ కుమార్ ఈ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. ఆ పార్టీ నేత కేసీ త్యాగి ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు.

నితీశ్ కుమార్‌కు ప్రధాని పదవి ఆఫర్ వచ్చిందని, ఆయన మాత్రం తిరస్కరించారని తెలిపారు. ఈ విషయమై ఇండియా కూటమి నేతలు… తమ అధినేతను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. కానీ ప్రస్తుతం తాము ఎన్డీయేలో ఉన్నామని స్పష్టం చేశారు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ కూడా స్పందించింది. త్యాగి వ్యాఖ్యలను ఖండించింది. నితీశ్‌ను ప్రధానిగా చేసేందుకు ఇండి కూటమి సంప్రదించడంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది. ఈ విషయం గురించి కేవలం ఆయనకు మాత్రమే తెలుసునని చురక అంటించింది.

Related posts

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై అరవింద్ కేజ్రీవాల్ క్లారిటీ…

Ram Narayana

రాజ్యసభకు నితీశ్ కుమార్.. బీహార్‌కు కొత్త సీఎం!

Ram Narayana

నితీశ్ వ్యాఖ్యలకు తేజస్వీ యాదవ్ కౌంటర్..!

Ram Narayana