Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

ఎన్నికల్లో ఓడినా సరే వరించిన కేంద్ర మంత్రి పదవి…

  • మోడీ 3.0 కేబినెట్ లో మురుగన్, బిట్టూ
  • తమిళనాడులో పోరాడి ఓడిన మురుగన్
  • బీజేపీ ఓట్ల శాతం పెంచిన నేత
  • పంజాబ్ లో పార్టీ మారిన బిట్టూకు మంత్రి పదవి

లోక్ సభ ఎన్నికల్లో ఓటమితో కుంగిపోయిన ఆ నేతలను కేంద్ర మంత్రి పదవి రూపంలో అదృష్టం వరించింది. ప్రత్యక్ష పోరులో ఓడినప్పటికీ పార్టీని గెలిపించేందుకు వారు చేసిన కృషిని పార్టీ అధిష్ఠానం గుర్తించింది. నరేంద్ర మోదీ 3.0 కేబినెట్ లో చోటిచ్చింది. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్, పంజాబ్ కు చెందిన బీజేపీ నేత రవ్నీత్ సింగ్ బిట్టూ ఆదివారం సాయంత్రం కేంద్ర మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

ఎల్.మురుగన్
బీజేపీ తమిళనాడు రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎల్. మురుగన్ నీలగిరి నియోజకవర్గం నుంచి లోక్ సభకు పోటీ చేశారు. కానీ, డీఎంకే నుంచి పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా చేతిలో ఓటమి చవిచూశారు. అయితే, 2021లోనే రాజ్యసభకు ఎంపికైన మురుగన్.. ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. తమిళనాడులో బీజేపీ ఈసారి బాగా పుంజుకుంది. ఒక్క సీటు కూడా గెలుచుకోనప్పటికీ ఓట్ల శాతం పెరిగింది.

దీంతో కేంద్ర మంత్రివర్గంలో తమిళనాడుకు ప్రాతినిధ్యం కల్పించాలని బీజేపీ అధిష్ఠానం భావించింది. తొలుత తమిళనాడు పార్టీ అధ్యక్షుడు అన్నామలైకి మంత్రి పదవి దక్కిందంటూ ప్రచారం జరిగినా చివరికి ఎల్.మురుగన్ ప్రమాణ స్వీకారం చేశారు. 2021లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు మురుగన్ ఎంతో కష్టపడ్డారని, ఆ కష్టానికి ప్రతిఫలంగానే కేంద్ర మంత్రి పదవి లభించిందని ఆయన అనుచరులు చెబుతున్నారు.

రవ్నీత్ సింగ్ బిట్టూ
కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ నేతగా ఎదిగి, మూడు సార్లు లోక్ సభకు ప్రాతినిధ్యం వహించిన రవ్నీత్ సింగ్ బిట్టూ.. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. పంజాబ్ లోని అనంత్ పూర్ సాహిబ్ నుంచి, తర్వాత లూథియానా నుంచి లోక్ సభకు ఎన్నికవుతూ వస్తున్న రవ్నీత్.. ప్రతిపక్షంలో కూర్చోవడం తన వల్ల కాదని, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలంటే అధికార పార్టీలోనే ఉండాలని చెబుతూ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే, ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ బీజేపీ అధిష్ఠానం ఆయనను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది. పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, ఖలిస్థానీ తీవ్రవాదుల చేతుల్లో హత్యకు గురైన బియాంత్ సింగ్ మనుమడే రవ్నీత్ సింగ్ బిట్టూ. కాగా, మొత్తం 13 సీట్లు ఉన్న పంజాబ్ లో బీజేపీ బోణీ కొట్టలేదు.

Related posts

రాహుల్ గాంధీ అమేథి నుంచి పోటీ చేయాలి: కేంద్రమంత్రి అమిత్ షా

Ram Narayana

ఈడీ విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా

Ram Narayana

వారణాసిలో మోడీతో తలపడుతున్న కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్…!

Ram Narayana

Leave a Comment