జాతీయ రాజకీయ వార్తలు

దేవుళ్లు రాజకీయాలు చేయరు…మోడీపై మమతా మరోసారి కౌంటర్..

మోదీకి గుడి కట్టించి ప్రసాదం పెడతాను

  • మోదీ తనకు తాను దేవుడిగా భావించుకుంటే ఒక్కటే చెబుతానన్న మమతా బెనర్జీ
  • మోదీగారు దయచేసి ఆలయంలో కూర్చుంటే రోజూ పూజలు చేస్తామని ఎద్దేవా
  • ఇకనైనా దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు

దేవుళ్లు రాజకీయాలు చేయరనే విషయం ప్రధాని నరేంద్ర మోదీ తెలుసుకోవాలని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. తనను దేవుడే పంపించాడని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆమె మరోసారి కౌంటర్ ఇచ్చారు. దేవుళ్లు రాజకీయాలు చేసి అల్లర్లు ప్రేరేపించరన్నారు.

దేశ ప్రయోజనాల కోసం తనను భగవంతుడు పంపించాడని మోదీ వ్యాఖ్యలు చేశారని… ఆయన తనను తాను మరో దేవుడిగా భావించుకంటున్నాడని ఎద్దేవా చేశారు. కానీ దేవుళ్లు రాజకీయాలు చేయరని పేర్కొన్నారు.

ఆయన కనుక తనను తాను దేవుడిగా భావించుకుంటే తాను ఒక్కటే చెప్పదలుచుకున్నానని… మోదీ గారికి ఒక దేవాలయం నిర్మిస్తానని… ప్రసాదంగా గుజరాత్ ప్రత్యేక వంటకం డోక్లా పెడతానన్నారు. మోదీ గారు దయచేసి ఆలయంలో కూర్చోవాలని… రోజూ పూజలు చేస్తామని చురక అంటించారు. ఇకనైనా దేశాన్ని సమస్యల్లోకి నెట్టే ప్రయత్నాలు మానుకోవాలని హితవు పలికారు.

Related posts

టీవీకే పార్టీ శాసనసభాపక్ష నేతగా విజయ్ ఏకగ్రీవం

Ram Narayana

తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్.. స్టాలిన్ కూటమిలోకి ‘కెప్టెన్’ పార్టీ!

Ram Narayana

తెలంగాణలో ఈసారి అత్యధిక స్థానాలు గెలుస్తాం .. తెలుగు ఛానల్‌తో ప్రధాని నరేంద్ర మోదీ

Ram Narayana