Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

పొరపాటున కొన్న టికెట్ కు 26 లక్షల లాటరీ తగిలింది.. అమెరికన్ ను వరించిన అదృష్టం

  • మేరీలాండ్ బార్ లో 10 డాలర్ల టికెట్ కొన్న ట్రక్ డ్రైవర్
  • బోనస్ ఆప్షన్ కింద మరో 40 డాలర్ల టికెట్ అంటగట్టిన బార్ టెండర్
  • ఖర్చులో ఖర్చని 40 డాలర్లు చెల్లించినట్లు డ్రైవర్ వెల్లడి
  • కెనో లాటరీ ఫలితాల్లో ఆ టికెట్ కు 32 వేల డాలర్ల బహుమతి

అమెరికాలోని మేరీలాండ్ లో ఓ ట్రక్ డ్రైవర్ ను అదృష్టం వరించింది. పొరపాటున కొనుగోలు చేసిన లాటరీ టికెట్ కు ఏకంగా 32 వేల డాలర్ల బహుమతి దక్కింది. కెనో మానిటర్ లో తన టికెట్ నెంబర్ చూసినపుడు నమ్మశక్యం కలగలేదని సదరు ట్రక్ డ్రైవర్ చెప్పాడు. పది డాలర్ల లాటరీ కొనుగోలు చేసే సమయంలో చేసిన పొరపాటు తనకు అదృష్టాన్ని తెచ్చిపెట్టిందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు.

బాల్టిమోర్ కు చెందిన ట్రక్ డ్రైవర్ కు మేరీలాండ్ వైపు వెళ్లినపుడు ఓ బార్ లో ఆగడం, మద్యం సేవించి సేదతీరడం అలవాటు. ఆ సమయంలో కెనో లాటరీ టికెట్ కొని తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంటాడు. అయితే, ఎప్పుడూ పది డాలర్లు మాత్రమే దీనికోసం వెచ్చిస్తాడు. ఈ నెల 5న మాత్రం పది డాలర్ల కెనో టికెట్ అడిగితే బార్ టెండర్ అదనంగా 40 డాలర్ల బోనస్ టికెట్ ను ఇచ్చింది. దానిని కొంటారా లేక వాపస్ చేస్తారా అని అడగగా ట్రక్ డ్రైవర్ తన పొరపాటుకు చింతిస్తూనే ఆ మొత్తం ఇచ్చేశాడు.

ఫలితాల రోజు కెనో మీటర్ చూస్తుంటే వరుసగా తన టికెట్ నెంబర్ పైనున్న అంకెలు కనబడడంతో ఆశ్చర్యపోయాడు. మొత్తం పది అంకెలలో వరుసగా తొమ్మిది అంకెలు సరిపోవడంతో ట్రక్ డ్రైవర్ కొన్న టికెట్ కు 32 వేల డాలర్ల లాటరీ తగిలింది. ఈ మొత్తం మన రూపాయల్లో 26 లక్షలకు పైమాటే. పొరపాటున కొన్న 40 డాలర్ల టికెట్ వల్ల ఆ ట్రక్ డ్రైవర్ 32 వేల డాలర్లు గెల్చుకున్నాడు. ఈ మొత్తాన్ని పొదుపు చేసుకుంటానని సదరు డ్రైవర్ చెప్పాడు.

Related posts

అమెరికాలోని హవాయి దీవుల్లో దోమల ట్రీట్ మెంట్ …!

Ram Narayana

చోరీకి వచ్చి నిద్రపోయిన దొంగ.. మర్నాడు ఉదయం అరెస్టు…

Ram Narayana

తల్లిదండ్రుల చిరకాల కోరికను నెరవేర్చిన యూట్యూబర్.. సోషల్ మీడియాలో ప్రశంసల జల్లు…

Ram Narayana

Leave a Comment