Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

కొందరు ఐఏఎస్ ,ఐపీఎస్ అధికారులను కలిసేందుకు అనుమతించని సీఎం చంద్రబాబు ..

సీఎంవో వద్దకు వచ్చిన శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, ఆంజనేయులు
ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు అందుకున్నారు. ఈ సందర్భంగా సచివాలయం మొదటి బ్లాక్ లోని సీఎం చాంబర్ వద్ద కోలాహలం నెలకొంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును టీడీపీ నేతలు, ఉద్యోగ సంఘాల నేతలు, పలువురు అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

కాగా, కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా చంద్రబాబును కలిసేందుకు యత్నించారు. శ్రీలక్ష్మి, అజయ్ జైన్, సునీల్ కుమార్, పీఎస్సార్ ఆంజనేయులు సీఎంవో వద్దకు వచ్చారు. అయితే, చంద్రబాబును కలిసేందుకు వారికి అనుమతి దక్కలేదు. దాంతో వారు వెనుదిరిగినట్టు తెలుస్తోంది.

శ్రీలక్ష్మి గతంలో మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. పీఎస్సార్ ఆంజనేయులు వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించారు. సునీల్ కుమార్ జగన్ హయాంలో సీఐడీ చీఫ్ గా పనిచేశారు.

Related posts

హైదరాబాదు పబ్ లకు… 21 ఏళ్లు నిండిన వారికే ప్రవేశం..

Drukpadam

ప్రమాదంలో పత్రికా స్వేచ్ఛ…టి యు డబ్ల్యూ జే ఐ జేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు రామ్ నారాయణ!

Drukpadam

టీటీడీకి వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు!

Drukpadam

Leave a Comment