Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

ఆగస్టు 15 నాటికి  లక్షా ఇరవై వేల ఎకరాలకు గోదావరి నీళ్లు…డిప్యూటీ సీఎం భట్టి

ఆగస్టు 15 నాటికి ఎన్కూరు లింకు కెనాల్ ను పూర్తి చేసి లక్షా ఇరవై వేల ఎకరాలకు ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం గోదావరి నీళ్లను అందిస్తుందని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు తెలిపారు. గురువారం సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తో కలిసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారి పల్లి వద్ద ఉన్న సీతారామ హెడ్ రెగ్యులేటరీ పనులను, అక్కడ ఉన్న వ్యూ పాయింట్ వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. అక్కడి నుంచి సీతారామా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పంప్ హౌజ్- 1 వద్దకు చేరుకొని పంప్ హౌజ్ పనులను పరిశీలించిన అనంతరం పవర్ సప్లై ను ప్రారంభించారు. ఆ తర్వాత పంపు హౌజ్ -3 వద్దకు చేరుకొని ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇప్పటివరకు జరిగిన ప్రాజెక్టు పనులు, కొనసాగుతున్న కెనాల్స్  పనులు, భూ సేకరణ, ప్రాజెక్టు పూర్తి కావడానికి కావలసిన నిధులు, ఎదురవుతున్న సమస్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇరిగేషన్ ఇంజనీరింగ్ అధికారులు మంత్రులకు వివరించారు. అనంతరం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ కేవలం రూ. 2654 కోట్లతో పూర్తయ్యే రాజీవ్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టుగా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు  పెంచి గత ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని విమర్శించారు. దశాబ్ద పాలనలో సీతారామ ప్రాజెక్టుపై ఎనిమిది వేల కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన గత ప్రభుత్వం ఒక్క ఎకరానికి కూడా తాగునీరు ఇవ్వలేదన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షలు చేశామన్నారు.  సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడానికి సమీక్షంచమన్నారు. సీతారామ ప్రాజెక్టు కు ఎన్ఎస్పిఎల్ కెనాల్ కు లింకు చేయడానికి 9 కిలోమీటర్లు ఉన్న ఎన్కూర్ లింక్ కెనాల్ ను పూర్తి చేయడానికి 72 కోట్లు రూపాయలు మంజూరి చేశామన్నారు. ఎన్నికల కోడ్ ముందు ఈ పనులను సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి వైరాకు వచ్చి శంకుస్థాపన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అదేవిధంగా పంప్స్ ట్రయల్ రన్ చేయడానికి కావలసిన పవర్ సప్లై కోసం నిధులు ఇచ్చామన్నారు. పంప్స్ ట్రయల్ రన్ ప్రాసెసింగ్ కొనసాగుతుందని చెప్పారు. ఎన్కూర్ లింకు కెనాల్ ను రాజీవ్ కెనాల్ గా నామకరణం చేస్తున్నట్టు వెల్లడించారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పంప్ హౌజ్ 1, 2, 3 డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ పనులు తొందరలోనే మొదలు పెడతామని వెల్లడించారు

ప్రణాళిక లేకుండా అనాలోచితంగా ఇరిగేషన్ సెక్టార్ను గత ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రం కోలుకోలేని విధంగా ఆర్థికంగా చాలా నష్టం చేసిందని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి విమర్శించారు. కాలేశ్వరం ప్రాజెక్టుకు 90 4000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కేవలం 93000 ఎకరాల కొత్త ఆయకట్టు మాత్రమే సాగులోకి తీసుకువచ్చిందని వివరించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 27 వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి  గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక ఎకరం కూడా కొత్త ఆయకట్టు తీసుకురాలేదన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు 9000 కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఒక ఎకరం కొత్త ఆయకట్టుకు నీరు ఇవ్వలేదన్నారు. గత బిహారీ సర్కార్ మొదలుపెట్టిన ఏ సాగునీటి ప్రాజెక్టులను 10 సంవత్సరాల పాలనలో పూర్తి చేయలేని అసమర్ధత ప్రభుత్వమని విమర్శించారు. కొత్తగూడెం పినపాక భద్రాచలం నియోజకవర్గం హామీ ఇచ్చారు తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో సాగునీరు ఇవ్వడానికి ఇరిగేషన్ శాఖ ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతున్నదని వివరించారు. 2000 కోట్లతో పూర్తయి రాజీవ్ సాగర్ ను సరైన కారణం లేకుండా రీ డిజైన్ చేసి 20 వేల కోట్ల రూపాయలకు గత ప్రభుత్వం పెంచడం వెనుక ఆంతర్యం ఏంటో ప్రజలకు అర్థం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో ఏర్పడిన ప్రజా ప్రభుత్వం గోదావరి నది జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చి సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. రీడిజన్ పేరిట తప్పుడు నిర్ణయం తీసుకొని రాష్ట్రానికి హార్దిక భారం మోపినప్పటికీ సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేయడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు సీతారామ ప్రాజెక్టు పూర్తి కావడానికి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కేంద్ర పర్యావరణ శాఖలో ఉన్న స్త్రీలను తొలగించి పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తామన్నారు. సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ కెనాల్ మరమ్మత్తులను యుద్ధ ప్రాతిపదిక పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు రైతులకు మేలు జరిగే విధంగా భారీ మధ్య చిన్న తరహా సాగునీటి పెండింగ్ ప్రాజెక్టును ఖమ్మం జిల్లాలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు

1.2 lakh acres to get Godavari water by Aug 15

Public money misused in the name of Sitarama project redesign

Previous BRS govt spent Rs 8,000 cr but no water release to even one acre

Dep CM reviews Sitarama Project with Ministers

Ex CM KCR destroyed Irrigation sector , says Uttam Kumar Reddy

Dep CM, Ministers travel 63 km along canal

Deputy Chief Minister Bhatti Vikramarka Mallu has announced that the Cong People’s government will provide Godavari waters to 1.2 lakh acres by completing Enkur Link canal by Aug 15.

Mr Bhatti inspected the Sitarama Head Regulatory works along with Irrigation Minister Uttam Kumar Reddy, Revenue Minister Ponguleti Srinuvas Reddy and Agriculture Minuster Tummala Nageswara Rao at Ammagaripalli in Aswapuram mandal in Bhadradri kothagudem district on Thursday.
They also witnessed the photo exhibition organised at the View Point there.
From there the team went to Sitarama Lift Irrigation Project Pump House -I and examined the works and inaugurated the power supply.

They also went to Pump House-3 and reviewed the progress of the project with officials.

The irrigation engineering officials in a power point presentation explained the project works done so far, ongoing canal works, land acquisition, funds required for project completion and problems encountered in completing the project.

Later addressing the meeting, Mr Bhatti said that the previous govt redesigned Rajiv , Indira Sagar projects that would have been completed with Rs 2654 crore as Sitarama Project and enhanced the project cost to Rs 20,000 crore and misused the public money.
The previous govt in the last 10 years spent Rs 8,000 crore on Sitarama project but did not provide irrigation facility to even one acre.
The Cong govt soon after coming to power held a high level review meeting at the Secretariat for completing the pending projects including Sitarama project.
The govt sanctioned Rs 72 crore to complete the nine km enkur link canal to connect Sitarama project with NSP canal, Mr Bhatti said and recalled that Irrigation Minister before the election code came into effect , laid foundation for the work at Wyra. The govt also sanctioned funds for power supply to facilitate the trial run of pumps. The process of trial runs of pumps is continuing.
He said the Enkur link canal will be christened as Rajiv canal.
Mr Bhatti disclosed that Sitarama Lift irrigation Pump House 1, 2, 3 distributary package works would be commenced soon.

Irrigation Sector destroyed by KCR: Minister Uttam Kumar Reddy

Irrigation Minister Uttam Kumar Reddy criticised that former Chief Minister KCR destroyed the irrigation sector without any vision or scientific plan and subjected the State to great financial loss.
The BRS govt spent Rs 90,400 crore on Kaleshwaram project and brought only 93,000 acres of new ayacut under cultivation.
The previous BRS govt spent Rs 27,000 crore on Palamur- Ranga Reddy Lift Irrigation project but did not bring even one acre of new ayacut under cultivation.
The BRS govt spent Rs 9,000 crore on Sitarama Lift Irrigation project but did not provide water to even one acre of new ayacut.
The previous BRS govt was an inefficient govt which did not complete any one irrigation project taken up in its 10 year rule, Mr Uttam Kumar Reddy said.
He said that under the Cong govt, the irrigation department prepared a plan to provide irrigation facility to large extent of agriculture land at lesser cost and in the least possible time. He gave assurance to provide irrigation facility to Kothagudem, Pinapaka and Bhadrachalam constituencies.
People should understand the real motive of previous BRS govt in redesigning Rajiv Sagar that would have been completed with Rs 2,000 crore to a whopping Rs 20,000 crore cost without any justifiable reason.
The Cong Govt formed in Indiramma rajyam would work with the objective of bringing Godavari waters to undivided Khammam district and make it a fertile land.
The State govt is committed to complete Sitarama project though it posed a burden on the State due to redesigning.
The govt would strive to clear objections raised by National Green Tribunal and Central Environment department.
He directed officials to complete repairs to Sitarama Lift irrigation canal on a war footing. He gave assurance to complete pending major , medium and minir irrigation projects in Khammam district.

15 अगस्त तक 1.2 लाख एकड़ भूमि को गोदावरी का पानी मिलेगा

सीताराम परियोजना के पुनर्निर्माण के नाम पर जनता के पैसे का दुरुपयोग

पिछली बीआरएस सरकार ने 8,000 करोड़ रुपये खर्च किए, लेकिन एक एकड़ भूमि को भी पानी नहीं दिया गया

उपमुख्यमंत्री ने मंत्रियों के साथ सीताराम परियोजना की समीक्षा की

पूर्व मुख्यमंत्री केसीआर ने सिंचाई क्षेत्र को बर्बाद कर दिया: उत्तम कुमार रेड्डी

उपमुख्यमंत्री, मंत्रियों ने नहर के किनारे 63 किलोमीटर की यात्रा की

उपमुख्यमंत्री भट्टी विक्रमार्क मल्लू ने घोषणा की है कि कांग्रेस की सरकार 15 अगस्त तक एन्कुर लिंक नहर का काम पूरा करके 1.2 लाख एकड़ भूमि को गोदावरी का पानी उपलब्ध कराएगी।

श्री भट्टी ने गुरुवार को भद्राद्री कोठागुडेम जिले के अश्वपुरम मंडल के अम्मागरीपल्ली में सिंचाई मंत्री उत्तम कुमार रेड्डी, राजस्व मंत्री पोंगुलेटी श्रीनुवास रेड्डी और कृषि मंत्री तुम्मला नागेश्वर राव के साथ सीताराम हेड विनियामक कार्यों का निरीक्षण किया।
उन्होंने वहां व्यू प्वाइंट पर आयोजित फोटो प्रदर्शनी का भी अवलोकन किया।
वहां से टीम सीताराम लिफ्ट सिंचाई परियोजना पंप हाउस-1 पर गई और कार्यों की जांच की तथा विद्युत आपूर्ति का उद्घाटन किया। वे पंप हाउस-3 भी गए और अधिकारियों के साथ परियोजना की प्रगति की समीक्षा की। सिंचाई अभियांत्रिकी अधिकारियों ने पावर प्वाइंट प्रेजेंटेशन में अब तक किए गए परियोजना कार्यों, चल रहे नहर कार्यों, भूमि अधिग्रहण, परियोजना को पूरा करने के लिए आवश्यक धनराशि तथा परियोजना को पूरा करने में आने वाली समस्याओं के बारे में बताया। बाद में बैठक को संबोधित करते हुए श्री भट्टी ने कहा कि पिछली सरकार ने 2654 करोड़ रुपये की लागत से पूरी होने वाली राजीव, इंदिरा सागर परियोजनाओं को सीताराम परियोजना के रूप में पुनः डिजाइन किया तथा परियोजना की लागत को बढ़ाकर 20,000 करोड़ रुपये कर दिया तथा जनता के पैसे का दुरुपयोग किया। पिछली सरकार ने पिछले 10 वर्षों में सीताराम परियोजना पर 8,000 करोड़ रुपये खर्च किए, लेकिन एक एकड़ में भी सिंचाई सुविधा उपलब्ध नहीं कराई। कांग्रेस सरकार ने सत्ता में आते ही सीताराम परियोजना सहित लंबित परियोजनाओं को पूरा करने के लिए सचिवालय में उच्च स्तरीय समीक्षा बैठक की। श्री भट्टी ने कहा कि सरकार ने सीताराम परियोजना को एनएसपी नहर से जोड़ने के लिए नौ किलोमीटर लंबी एनकुर लिंक नहर को पूरा करने के लिए 72 करोड़ रुपये मंजूर किए हैं। उन्होंने याद दिलाया कि चुनाव आचार संहिता लागू होने से पहले सिंचाई मंत्री ने वायरा में काम की नींव रखी थी। सरकार ने पंपों के ट्रायल रन की सुविधा के लिए बिजली आपूर्ति के लिए भी धनराशि मंजूर की है। पंपों के ट्रायल रन की प्रक्रिया जारी है। उन्होंने कहा कि एनकुर लिंक नहर का नाम राजीव नहर रखा जाएगा। श्री भट्टी ने खुलासा किया कि सीताराम लिफ्ट सिंचाई पंप हाउस 1, 2, 3 वितरण पैकेज का काम जल्द ही शुरू किया जाएगा। केसीआर ने सिंचाई क्षेत्र को नष्ट कर दिया: मंत्री उत्तम कुमार रेड्डी सिंचाई मंत्री उत्तम कुमार रेड्डी ने आलोचना की कि पूर्व मुख्यमंत्री केसीआर ने बिना किसी दूरदर्शिता या वैज्ञानिक योजना के सिंचाई क्षेत्र को नष्ट कर दिया और राज्य को भारी वित्तीय नुकसान पहुंचाया। बीआरएस सरकार ने कालेश्वरम परियोजना पर 90,400 करोड़ रुपये खर्च किए और केवल 93,000 एकड़ नए अयाकट को खेती के अधीन लाया। पिछली बीआरएस सरकार ने पालमूर-रंगा रेड्डी लिफ्ट सिंचाई परियोजना पर 27,000 करोड़ रुपये खर्च किए, लेकिन एक एकड़ नए अयाकट को भी खेती के लायक नहीं बनाया। बीआरएस सरकार ने सीताराम लिफ्ट सिंचाई परियोजना पर 9,000 करोड़ रुपये खर्च किए, लेकिन एक एकड़ नए अयाकट को भी पानी नहीं दिया। श्री उत्तम कुमार रेड्डी ने कहा कि पिछली बीआरएस सरकार एक अकुशल सरकार थी, जिसने अपने 10 साल के शासन में एक भी सिंचाई परियोजना पूरी नहीं की। उन्होंने कहा कि कांग्रेस सरकार के तहत, सिंचाई विभाग ने कम लागत और कम से कम समय में बड़े पैमाने पर कृषि भूमि को सिंचाई सुविधा प्रदान करने की योजना तैयार की। उन्होंने कोठागुडेम, पिनापाका और भद्राचलम निर्वाचन क्षेत्रों में सिंचाई सुविधा प्रदान करने का आश्वासन दिया। लोगों को बिना किसी उचित कारण के 2,000 करोड़ रुपये की लागत से बनने वाले राजीव सागर को फिर से डिजाइन करने में पिछली बीआरएस सरकार के वास्तविक मकसद को समझना चाहिए। इंदिराम्मा राज्यम में गठित कांग्रेस सरकार अविभाजित खम्मम जिले में गोदावरी का पानी लाने और इसे उपजाऊ भूमि बनाने के उद्देश्य से काम करेगी।

राज्य सरकार सीताराम परियोजना को पूरा करने के लिए प्रतिबद्ध है, हालांकि पुनर्रचना के कारण यह राज्य पर बोझ बन गई है।

सरकार राष्ट्रीय हरित अधिकरण और केंद्रीय पर्यावरण विभाग द्वारा उठाई गई आपत्तियों को दूर करने का प्रयास करेगी।

उन्होंने अधिकारियों को सीताराम लिफ्ट सिंचाई नहर की मरम्मत युद्ध स्तर पर पूरी करने का निर्देश दिया। उन्होंने खम्मम जिले में लंबित प्रमुख, मध्यम और लघु सिंचाई परियोजनाओं को पूरा करने का आश्वासन दिया।

Related posts

ప్రియాంక గాంధీ , డీకే శివకుమార్ లకు తెలంగాణ ఎన్నికల పర్వేక్షణ భాద్యత …!

Ram Narayana

నేటితో ఎన్నికల ప్రచారానికి తెర…గెలుపుపై ఎవరికీ వారే ధీమా …!

Ram Narayana

పెద్ద శబ్దంతో కుంగిన మేడిగడ్డ బ్యారేజీ వంతెన…కుట్రకోణం ఉందనే దిశగా పోలీసులకు ఫిర్యాదు!

Ram Narayana

Leave a Comment