- టీ20 వరల్డ్ కప్ విజేతగా టీమిండియా
- టీమిండియాపై అభినందనల వెల్లువ
- టీమిండియా బృందానికి తియ్యని కబురు చెప్పిన జై షా
ఐసీసీ టైటిళ్ల కరవు తీర్చుతూ టీమిండియా టీ20 వరల్డ్ కప్-2024లో విజేతగా నిలిచింది. రోహిత్ శర్మ నాయకత్వంలోని టీమిండియా ఈ టోర్నీలో చాంపియన్స్ గా అవతరించడం పట్ల సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
తాజాగా, బీసీసీఐ కార్యదర్శి జై షా టీమిండియాకు రూ.125 కోట్ల భారీ నజరానా ప్రకటించారు. ఈ విషయాన్ని జై షా స్వయంగా వెల్లడించారు. ఈ టోర్నీ ఆసాంతం టీమిండియా అద్భుతమైన ప్రతిభ, పట్టుదల, క్రీడాస్ఫూర్తి కనబర్చిందని కొనియాడారు. ఆటగాళ్లందరికీ, కోచింగ్ సిబ్బందికి, ఇతర సహాయక సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని జై షా పేర్కొన్నారు. టీమిండియాకు రూ.125 కోట్ల నజరానా ప్రకటించడానికి ఎంతో సంతోషిస్తున్నానని తెలిపారు.