- టీ20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియా
- రోహిత్ సేనపై అభినందనల వెల్లువ
- రోహిత్ శర్మకు స్వయంగా ఫోన్ చేసి అభినందించిన ప్రధాని మోదీ
తిరుగులేని ఆటతీరుతో టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న టీమిండియాపై అభినందనల వెల్లువ కొనసాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఈ విషయాన్ని మోదీనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
“ప్రియమైన రోహిత్ శర్మ… అద్భుతమైన వ్యక్తిత్వం నీ సొంతం. నీ దూకుడు మనస్తత్వం, ధాటియైన బ్యాటింగ్, చురుకైన కెప్టెన్సీ భారత జట్టుకు కొత్త కోణాన్ని జోడించాయి. నీ టీ20 కెరీర్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇవాళ ఉదయం నీతో మాట్లాడినందుకు ఎంతో ఆనందంగా ఉంది” అంటూ రోహిత్ తో ఫోన్ లో తానేం మాట్లాడారో ప్రధాని వెల్లడించారు.