Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆఫ్ బీట్ వార్తలు

అవి గ్రహాంతరవాసుల వాహనాలేనా… కెనడా దంపతుల వీడియో వైరల్…

  • సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసిన కెనడా దంపతులు
  • విన్నిపెగ్ నదిపై రెండు మండుతున్న అగ్నిగోళాలు ప్రత్యక్షం
  • వీడియో తీసిన జస్టిస్ స్టీవెన్సన్, డానియెల్లే స్టీవెన్సన్
  • వీడియో తీస్తుండగా మరో రెండు అగ్నిగోళాల వంటి ఆకృతులు ప్రత్యక్షం

గ్రహాంతర వాసులు (ఏలియన్స్), వారు ఉపయోగించే వాహనాలు (యూఎఫ్ఓ) ఇప్పటికీ మానవాళికి మిస్టరీగానే ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా యూఎఫ్ఓల గురించి చర్చ జరుగుతూనే ఉంది. గతంలో  నాసాకు చెందిన పైలెట్లు కూడా తాము యూఎఫ్ఓలను గుర్తించామని చెప్పడంతో ప్రజల్లో ఆసక్తి మరింత అధికమైంది. 

తాజాగా, సోషల్ మీడియాలో ఓ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కెనడాకు చెందిన జస్టిన్ స్టీవెన్సన్, డానియెల్లె డానియల్స్ స్టీవెన్సన్ దంపతులు మనిటోబాలోని ఫోర్ట్ అలెగ్జాండర్ వద్ద విన్నిపెగ్ నది సమీపంలో ప్రయాణిస్తుండగా… వారికి నదిపై దూరంగా రెండు వెలుగుతున్న అగ్నిగోళాల వంటి ఆకృతులు కనిపించడంతో, వారు ఆ దృశ్యాలను వీడియో రికార్డు చేశారు. 

సూర్యుడిలా భగభగమండిపోతున్న ఆ వస్తువులు ఆకాశంలో అకస్మాత్తుగా ప్రత్యక్షమయ్యాయని, దాంతో కారును ఆపివేసి వాటిని చిత్రీకరించామని స్టీవెన్సన్ దంపతులు వెల్లడించారు. తాము ఆ రెండు ఆకృతులను వీడియో తీస్తుండగా, మరో రెండు ఆకృతులు కూడా ప్రత్యక్షమయ్యాయని తెలిపారు. 

తాము మొత్తానికి ఏవో విచిత్రమైన వస్తువులను చూశామని, అవేంటో తెలియాల్సి ఉందని జస్టిన్ స్టీవెన్సన్ పేర్కొన్నాడు. బహుశా మేము చూసింది ఏలియన్స్ నేమో అని వ్యాఖ్యానించాడు.

Related posts

టికెట్ లేని ప్రయాణికులతో కిక్కిరిసిన థర్డ్ ఏసీ బోగీ!

Ram Narayana

ఒకటి, రెండు, మూడు రోజులు కాదు.. లక్షల ఏళ్లపాటు ఆగని వాన!

Ram Narayana

వేప చెట్టుకు మామిడి పండ్లు!

Ram Narayana

Leave a Comment