హథ్రాస్ పాపం ఎవరిదీ …తొక్కిసలాటలో రక్తపాతం 122 మంది మృతి …
పరారీలో భోలే బాబా
సత్సంగ్‌కు 80 వేల మందికే అనుమతి
2.5 లక్షల మంది హాజరయ్యారన్న సీఎస్
బాబా పాదాలను టచ్ చేసే క్రమంలో తొక్కిసలాట
సత్సంగ్ నిర్వాహకులపై ఎఫ్ఐఆర్ నమోదు
ఘటన తర్వాత పరారీలో భోలేబాబా
ఉత్తరప్రదేశ్‌లోని హథ్రాస్ ఘోరం జరిగింది …రక్తపాతం జరిగింది …భోలేబాబా మాయమాటలకు వందమందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు …ఈ పాపం ఎవరిదీ …భోలెబాబాదా …అందుకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వానిదా …? అనుమతి కేవలం 80 మందికి మాత్రమే తీసుకొన్నారని ,కానీ 2 లక్షల 50 వేలమంది ప్రజలు హాజరైయ్యారని యూపీ చీఫ్ సెక్రటరీ చెప్పొకొచ్చారు …అంటే భాద్యత తమదికాదని తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు …తమ ఇంటిలిజెన్స్ ఏమైందని ప్రశ్నకు ఆయన సమాధానం కావాల్సి ఉంది …నిత్యం పేదప్రజలపై ప్రతాపం చూపిస్తూ వారిని వేధిస్తున్న అధికారులు ,పాలకులు ఈసంఘటననుంచి తప్పించుకోజాలరు …దేశ అత్యన్నత న్యాయస్థానం సూమోటో తో జోక్యం చేసుకొని అధికారులపై కేసు నమోదు చేయాలి … ఇప్పటికే భోలే బాబా పరారు అయ్యాడని చెప్పడం సిగ్గుమాలిన చర్య …ఈసంఘటనలో ఇప్పటికే 122 మంది చనిపోయారని అధికారులే చెపుతున్నారు అంటే మరణాలు ఇంకా ఎన్ని ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయి…
హథ్రాస్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 122కి పెరిగింది. ప్రభుత్వ ఆసుపత్రిలో మృతదేహాలను ఐస్‌బాక్స్‌ల్లో పెట్టి భద్రపరుస్తున్నారు. మరోవైపు, తమవారి కోసం వస్తున్న బాధితులతో ఆసుపత్రి పరిసరాలు కిక్కిరిపోయాయి. ఎటుచూసినా విషాదం కనిపిస్తోంది. సికింద్రారౌ ప్రాంతంలోని ఫుల్రాయ్ గ్రామంలో నిన్న భోలేబాబా నిర్వహిచిన సత్సంగ్‌లో తొక్కిసలాట జరిగింది. ఈ కార్యక్రమానికి వేలాదిగా హాజరైన భక్తులు భోలేబాబా కాళ్లను తాకేందుకు ప్రయత్నించడంతో ఒక్కసారిగా తొక్కిసలాట చోటుచేసుకుంది.
సత్సంగ్‌కు దాదాపు 2.5 లక్షల మంది హాజరైనట్టు ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మనోజ్‌కుమార్ సింగ్ తెలిపారు. కానీ, నిర్వాహకులు మాత్రం 80 వేల మందికి మాత్రమే అనుమతి తీసుకున్నట్టు చెప్పారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నేడు హథ్రాస్‌ను సందర్శించనున్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వదిలిపెట్టేది లేదని సీఎం హెచ్చరించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం 24 గంటల్లో నివేదిక అందించాలని ఆదేశించింది. సత్సంగ్ నిర్వాహకులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, ఘటన తర్వాత స్వయం ప్రకటిత గాడ్‌మన్ భోలేబాబా పరారయ్యాడు. ఆయన కోసం గాలింపు మొదలైంది.