Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందించిన కేంద్రమంత్రి శ్రీనివాసవర్మ

  • ప్రత్యేక హోదా తీర్మానాలు చేస్తే ఇచ్చేది కాదని వ్యాఖ్య
  • హోదాపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీ అని వెల్లడి
  • బీహార్ రాష్ట్రానికి ఇదే వర్తిస్తుందని స్పష్టీకరణ

ప్రత్యేక హోదా… రాష్ట్ర ప్రభుత్వాలు తీర్మానాలు చేసినంత మాత్రాన ఇచ్చేది కాదని, అలా అయితే దేశంలోని అన్ని రాష్ట్రాలు కూడా చేస్తాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ కార్యాలయంలో ‘అమ్మ’ పేరుతో ఆయన మొక్క నాటారు. అనంతరం మాట్లాడుతూ… ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై తాను ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు. ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాల్సింది ప్రధాని మోదీయే అన్నారు. బీహార్ రాష్ట్రానికీ ఇదే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

హోదా ఎందుకు ఇవ్వలేదో గతంలోనే స్పష్టంగా చెప్పామన్నారు. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు చెప్పారు. ఆ నిధుల ద్వారా ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. ఏపీ అభివృద్ధికి ఎలాంటి సహకారం కావాలో ఆలోచించి ముందుకు సాగుతామని హామీ ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం కారణంగా పోలవరం సమస్యల్లో ఉందన్నారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం సహకారం ఉంటుందన్నారు.

Related posts

అమెరికా వైట్‌హౌస్ పరిసరాల్లోకి ట్రక్‌తో దూసుకెళ్లిన తెలుగు యువకుడికి శిక్ష !

Drukpadam

మహారాష్ట్రలో మళ్లీ విరిగిపడిన కొండచరియలు.. శిథిలాల కింద 300 మంది!

Drukpadam

హెచ్1బీ వీసా హోల్డర్లకు కెనడా బంపర్ ఆఫర్…

Drukpadam

Leave a Comment