- ఇటీవల నీట్ యూజీ ఎంట్రన్స్ పేపర్ లీక్
- సుప్రీంకోర్టులో నేడు విచారణ
- నీట్ పేపర్ లీక్ అయిన మాట వాస్తవం అని నిర్ధారించిన సుప్రీంకోర్టు
- లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో తేలాల్సి ఉందని వెల్లడి
నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష పేపర్ లీక్ అంశంపై సుప్రీంకోర్టులో నేడు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. నీట్ క్వశ్చన్ పేపర్ లీకైన మాట వాస్తవం అని స్పష్టం చేసింది. అయితే, లీకైన పేపర్ ఎంతమందికి చేరిందన్న విషయం తేలాల్సి ఉందని పేర్కొంది.
పేపర్ లీక్ తో ఇద్దరు విద్యార్థులకే సంబంధం ఉందని అంటున్నారు… లీకైన పేపర్ ఎంతమందికి చేరిందో గుర్తించారా? పేపర్ లీక్ తో ఎంతమంది ప్రయోజనం పొందారో గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందా? పేపర్ లీక్ తో ప్రయోజనం పొందిన విద్యార్థులపై ఏం చర్యలు తీసుకున్నారు? ఎంతమంది విద్యార్థుల ఫలితాలు విత్ హెల్డ్స్ లో ఉంచారు? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
నీట్ పేపర్ లీక్ అనేది 23 లక్షల మందితో ముడిపడిన అంశమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అందుకే, అన్ని వైపుల నుంచి జాగ్రత్తగా పరిశీలించాకే తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. అనంతరం, తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.