ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం పట్ల పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం …
ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ తో సత్కారం
మోడీని శాంతి దూతగా కీర్తించిన పుతిన్

ప్రపంచంలోనే అత్యంత బలమైన నేతగా, శాంతి దూతగా కీర్తించబడుతున్న భారత ప్రధాని మోడీకి రష్యా అత్యున్నత పురస్కారం ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్ తో సత్కరించడంపట్ల బీజేపీ జాతీయ నాయకులు తమిళనాడు , కర్ణాటక రాష్ట్రాల పార్టీ వ్యహారాలు కో -ఇంచార్జి ,తెలంగాణ కోరుకోమిటి సభ్యులు పొంగులేటి సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు… మూడవసారి భారత ప్రధానికి భాద్యతలు చేపట్టిన తర్వాత మోడీకి లభించిన అత్యున్నత పురస్కారం ఇది కావడం విశేషమన్నారు ….నేడు భారత దేశాన్ని ప్రపంచంలో అగ్రగామి దేశంగా ముందడుగు వేయిస్తున్న మోడీకి ప్రపంచంలో పెరుగుతున్న ఆదరణకు రష్యా పురస్కారం ఉదాహరణ అని అన్నారు …ఆర్ధికరంగంలో కూడా దేశాన్ని ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద ఆర్ధిక శక్తిగా తీర్చిదిద్దుతున్న మోడీకి మరింత శక్తిని ఇవ్వాలని భగవంతుని కోరుకుంటున్నట్లు సుధాకర్ రెడ్డి తెలిపారు …