Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
ఆంధ్రప్రదేశ్

ఏరా చెల్లెమ్మా… ఎలా ఉన్నారు..?

మహిళా కూలీలకు పొంగులేటి ఆప్యాయ పలకరింపు

ఎంవీ. పాలెం వద్ద కాన్వాయ్ ఆపి మాటా మంతి

ఖమ్మం రూరల్: ” ఏరా చెల్లెమ్మా.. ఎలా ఉన్నారు. పైరు బాగుంది. కలుపు తీస్తున్నారా..?” అంటూ తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలం ఎంవీ. పాలెం గ్రామం సమీపంలో మహిళా రైతు కూలీలతో ఇలా మాట్లాడారు. ఆరెంపులలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి తనగంపాడు వెళుతూ.. ఇలా రోడ్డు వెంట ఓ పత్తి చేను వద్ద ఆగారు. అక్కడ పనిచేస్తున్న మహిళా కూలీలతో మాట్లాడుతూ.. సాగు ఎలా ఉంది..? సొంత భూమి నా..? కౌలుకు చేస్తున్నారా అంటూ.. ఆరా తీశారు. పిల్లలు ఏం చేస్తున్నారు.. బాగా చదివించండి.. మన ప్రభుత్వంలో అందర్నీ ఆదుకుంటాం.. అంటూ ఆప్యాయంగా భరోసా ఇచ్చారు. సాక్షాత్తూ మంత్రినే తమ వద్దకు వచ్చి ఇలా మాట్లాడటం తో.. ఆ మహిళలు ఎంతో ఆనందించారు.

Related posts

సీటు బెల్ట్ విషయంలో ఇక కఠిన నిబంధనలు!

Drukpadam

ఖమ్మం టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్‌రావుకు ఈడీ స‌మ‌న్లు!

Drukpadam

ఏపీలో స్వాతంత్ర్య వేడుకలు.. ఎవరు ఎక్కడ జెండాను ఎగురవేస్తారంటే..!

Ram Narayana

Leave a Comment