Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలంగాణ వార్తలు

రుణమాఫీపై ప్రతిపక్షాలు బురదజల్లడం మానుకోవాలి …మంత్రి తుమ్మల

రేషన్ కార్డు నిబంధనపై తుమ్మల వివరణ

  • కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికే రేషన్ కార్డ్ అని వెల్లడి
  • కుటుంబ నిర్ధారణ కాగానే మిగతా వారికీ రుణమాఫీ చేస్తామని హామీ
  • 2018లో అవలంభించిన విధానాలనే ఇప్పుడు అమలు చేస్తున్నట్లు వెల్లడి

రైతు రుణమాఫీకి రేషన్ కార్డ్ నిబంధనపై బీఆర్ఎస్ విమర్శలు గుప్పించింది. ఈ క్రమంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం వివరణ ఇచ్చారు. రూ.2 లక్షల వరకు రుణమాఫీకి రేషన్ కార్డు కేవలం కుటుంబాన్ని నిర్ధారించడానికేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం దగ్గర అందరి వివరాలు ఉన్నట్లు తెలిపారు. కుటుంబం నిర్ధారణ కాగానే మిగతా వారికి కూడా రుణమాఫీ వర్తిస్తుందని వివరించారు.

2018లో అవలంభించిన విధానాలనే ఇప్పుడు అమలు చేస్తున్నట్లు చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చిన ఆరేడు నెలల్లోనే రూ.2 లక్షల రుణాన్ని ఏకకలంలో మాఫీ చేస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వంపై బురదజల్లాలనుకోవడం సరికాదన్నారు.

రుణమాఫీ నిబంధనలు

– భూమి క‌లిగి ఉన్న ప్ర‌తి రైతు కుటుంబానికి రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు రుణ‌మాఫీ.
– ఈ ప‌థ‌కం స్వ‌ల్ప‌కాలిక పంట రుణాల‌కు వ‌ర్తిస్తుంది.
– రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా స‌హ‌కార కేంద్ర బ్యాంకులు, వాటి బ్రాంచ్‌ల నుంచి తీసుకున్న పంట రుణాల‌కు ఈ ప‌థ‌కం వ‌ర్తిస్తుంది.
– 12.12.2018 తేదీన లేదా ఆ త‌ర్వాత మంజూరైన లేక రెన్యువ‌ల్ అయిన రుణాల‌కు, 09.12.2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాల‌కు ఈ ప‌థ‌కం వర్తింపు.
– ఈ ప‌థ‌కం కింద ప్ర‌తి రైతు కుటుంబం రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు పంట రుణ‌మాఫీకి అర్హులు. 09.12.2023 తేదీ నాటికి బ‌కాయి ఉన్న అస‌లు, వ‌ర్తింప‌య్యే వడ్డీ మొత్తం ప‌థ‌కానికి అర్హ‌త క‌లిగి ఉంటుంది.
– రైతు కుటుంబం నిర్ణ‌యించ‌డానికి పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ వారు నిర్వ‌హించే ఆహార భ‌ద్ర‌త కార్డు లేదా రేష‌న్ కార్డు డేటా బేస్ ప్రామాణికంగా ఉంటుంది. కాబ‌ట్టి ఆ కుటుంబంలో ఇంటి య‌జ‌మాని జీవిత భాగ‌స్వామి పిల్ల‌లు ఉంటారు.
– అర్హ‌త గ‌ల రుణ‌మాఫీ మొత్తాన్ని డీబీటీ ప‌ద్ధ‌తిలో నేరుగా ల‌బ్దిదారుల రుణ‌ ఖాతాల్లో జమ చేస్తారు. పీఏసీఎస్ విష‌యంలో రుణ‌మాఫీ మొత్తాన్ని డీసీసీబీ లేదా బ్యాంకు బ్రాంచికి విడుద‌ల చేస్తారు. ఆ బ్యాంకు వారు రుణ‌మాఫీ మొత్తాన్ని పీఏసీఎస్‌లో ఉన్న రైతు ఖాతాలో జ‌మ చేస్తారు.
– ప్ర‌తి రైతు కుటుంబానికి 09.12.2023 తేదీ నాటికి ఉన్న రుణ మొత్తం ఆధారంగా ఆరోహ‌ణ క్ర‌మంలో రుణ‌మాఫీ మొత్తాన్ని జ‌మ చేయాలి.
– ప్ర‌తి రైతు కుటుంబానికి 09.12.2023 నాటికి క‌లిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక రూ. 2 ల‌క్ష‌ల వ‌ర‌కు ఏది త‌క్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబం పొందే అర్హ‌త ఉంటుంది.
– ఏ కుటుంబానికి అయితే రూ.2 ల‌క్ష‌ల‌కు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు రూ.2 ల‌క్ష‌ల‌కు పైబ‌డి ఉన్న రుణాన్ని మొద‌ట బ్యాంకుల‌కు చెల్లించాలి. ఆ త‌ర్వాత అర్హ‌త గ‌ల రూ.2 ల‌క్ష‌ల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాల‌కు బ‌దిలీ చేస్తారు.
– రూ.2 ల‌క్ష‌ల కంటే ఎక్కువ రుణం ఉన్న ప‌రిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మ‌హిళ‌ల రుణాన్ని మొద‌ట మాఫీ చేసి, మిగులు మొత్తాన్ని దామాషా ప‌ద్ధ‌తిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాల‌ను మాఫీ చేయాలి.

Related posts

విద్యార్థునులకు గుడ్ న్యూస్ …త్వరలో ప్రభుత్వం స్కూటీలు పంపిణి ..

Ram Narayana

అమెరికాలో మరో తెలుగు విద్యార్థి మృతి…

Ram Narayana

తెలంగాణ‌లో ‘మీ సేవ‌’ ద్వారా మరో 9 ర‌కాల సేవలు…

Ram Narayana

Leave a Comment