Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ రాజకీయ వార్తలు

టైటానిక్‌లా బీజేపీ మునిగిపోవాలంటే మోదీయే బెస్ట్!: సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు…

  • ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో రెండుచోట్ల మాత్రమే గెలిచిన బీజేపీ
  • పది స్థానాల్లో ఇండియా కూటమి విజయం
  • బీజేపీ బీటలు వారుతోందని ఫలితాలు వెల్లడిస్తున్నాయని ట్వీట్

ప్రధాని నరేంద్రమోదీపై, బీజేపీపై ఆ పార్టీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలపై సామాజిక అనుసంధాన ఎక్స్ వేదికగా స్పందించారు. ‘బీజేపీలో ఉన్న మనం మన పార్టీ టైటానిక్ షిప్ మాదిరిగా మునిగిపోవాలని కోరుకుంటే, అందుకు సారథ్యం వహించడానికి నరేంద్రమోదీయే ఉత్తమమైనవాడు. బీజేపీ శాశ్వతంగా మునిగిపోయేలా బీటలు వారుతోందని ఉపఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి’ అని పేర్కొన్నారు.

ఇటీవల వివిధ రాష్ట్రాలలో జరిగిన ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి రెండు స్థానాల్లో విజయం సాధించింది. ఇండియా కూటమి పదిచోట్ల గెలిచింది. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇందులో ఎక్కువ సీట్లు ఇండియా కూటమి అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, తమిళనాడు వంటి రాష్ట్రాలు ఉన్నాయి.

Related posts

రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన మాజీ సీఎం

Ram Narayana

రాహుల్ గాంధీపై ఢిల్లీలోని మూడు పోలీస్ స్టేషన్లలో బీజేపీ ఫిర్యాదు!

Ram Narayana

ఏక్ నాథ్ షిండే సంతోషంగా లేరు: కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే

Ram Narayana

Leave a Comment