- 100 రోజులకు పైగా తీహార్ జైల్లో ఉంటున్న కవిత
- తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో దీన్ దయాళ్ ఆసుపత్రికి తరలింపు
- దీన్ దయాల్ ఆసుపత్రిలో కవితకు చికిత్స
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. జైల్లో ఆమె తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను జైలు నుంచి దీన్ దయాళ్ ఆసుపత్రికి వైద్య చికిత్స నిమిత్తం తరలించి, చికిత్స చేస్తున్నారు. తీహార్ జైల్లో కవిత 100 రోజులకు పైగా ఉంటున్నారు. కవిత అస్వస్థతకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆమె తీవ్ర జ్వరంతో బాధ పడుతున్నట్టు సమాచారం. లిక్కర్ కేసులో కవిత మార్చి 15న అరెస్ట్ అయ్యారు.
Save or share this story as a newspaper-style Epaper Clip: