- కొమొరస్ జెండాతో వెళ్తున్న నౌక
- ప్రమాద సమయంలో నౌకలో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది
- కొనసాగుతున్న సహాయక కార్యక్రమాలు
కొమొరస్ జెండాతో ప్రయాణిస్తున్న ‘ప్రెస్టీజ్ ఫాల్కన్’ చమురు నౌక ఒకటి ఒమన్ తీరంలో బోల్తాపడింది. దీంతో నౌకలోని 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది గల్లంతయ్యారు. నౌక మునిగిపోతున్నట్టు సముద్ర భద్రతా కేంద్రం వెల్లడించిన ఒక రోజు తర్వాత అది పూర్తిగా మునిగిపోయింది. అయితే, నౌక బోల్తా పడడం వల్ల చమురు కానీ, దానికి సంబంధించిన ఇతర ఉత్పత్తులు కానీ సముద్రంలో లీకవుతున్నదీ, లేనిదీ వెల్లడించలేదు.
నౌక యెమెనీ ఓడరేవు అడెన్‌కు వెళ్తుండగా ఒమన్ ప్రధాన పారిశ్రామిక పోర్టు అయిన దుక్మలో బోల్తాపడింది. 117 మీటర్ల పొడవైన ఈ చమురు నౌకను 2007లో నిర్మించారు. ఇలాంటి చిన్నచిన్న నౌకలను తీరప్రాంత ప్రయాణాలకు ఉపయోగిస్తారు. నౌకలోని వారిని రక్షించేందుకు చేపట్టిన సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.