Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
జాతీయ వార్తలు

 బ్రిటన్ నుంచి భారత్ చేరుకున్న ఛత్రపతి శివాజీ ఆయుధం…

  • నాడు యుద్ధ సమయాల్లో వాఘ్ నఖ్ ను ఉపయోగించిన శివాజీ
  • పులి పంజా వంటి ఆయుధమే ఈ వాఘ్ నఖ్
  • 1659లో అఫ్జల్ ఖాన్ ను చంపేందుకు వాఘ్ నఖ్ ను ఉపయోగించిన శివాజీ

వీర మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ యుద్ధ సమయాల్లో ఉపయోగించే ప్రత్యేకమైన ఆయుధం… వాఘ్ నఖ్. ఇది పులి పంజా ఆకారంలో ఉంటుంది. లోహంతో తయారైన వాఘ్ నఖ్ ను చేతికి ధరించి ఎదుటి వ్యక్తి శరీరాన్ని చీల్చివేయవచ్చు. 

1659లో బీజాపూర్ సామ్రాజ్య సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్ ను చంపడానికి శివాజీ ఈ వాఘ్ నఖ్ ను ఉపయోగించాడని చరిత్ర చెబుతోంది. కాలక్రమంలో ఈ చారిత్రక వస్తువు బ్రిటన్ కు చేరింది. లండన్ లోని ప్రఖ్యాత విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో దీన్ని ప్రదర్శనకు ఉంచారు. 

అయితే, అనేక ప్రయత్నాలు చేసిన మీదట, వందల ఏళ్ల తర్వాత ఈ ఆయుధం తిరిగి భారత్ చేరుకుంది. బుల్లెట్ ప్రూఫ్ కవర్ లో ఉంచి ఈ ఆయుధాన్ని భద్రంగా భారత్ కు తీసుకువచ్చారు. 

శివాజీ ఉపయోగించిన ఈ వాఘ్ నఖ్ లండన్ నుంచి ముంబయి చేరుకున్నట్టు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ వెల్లడించారు. సతారాలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఈ వాఘ్ నఖ్ ను ఏడు నెలల పాటు ప్రదర్శనకు ఉంచుతున్నామని వివరించారు.

Related posts

భారత సంపన్నుల్లో నెం.1గా ముఖేశ్ అంబానీ! తెలుగువారిలో టాప్ ఎవరంటే..!

Ram Narayana

ఇంకా మేల్కొనని ప్రజ్ఞాన్ రోవర్.. స్పందించిన ఇస్రో చీఫ్

Ram Narayana

పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ హింస.. నిలిచిపోయిన రైలు సర్వీసులు!

Drukpadam

Leave a Comment