సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ అకస్మిక మృతి…
ఖమ్మం సమీపంలోని రామన్నపేట దగ్గర రైలుపట్టాలపై మృతదేహం
రైలు ప్రమాదంలో మరణించినట్టుగా అనుమానం …
అనేక పోరాటాల్లో అగ్రభాగాన నిలిచిన నేత
ఆయన భార్య ,కుమారుడు
సిపిఐ ఎం ఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు రాయల చంద్రశేఖర్ రైలు ప్రమాదంలో ఆకస్మిక మృతి చెందారు … ఆయన ఈ తెలవారుజూమున ఖమ్మంకు సమీపంలోని రామన్నపేట దగ్గర రైలు పట్టాలపై మృతి చెంది ఉండటం గమనించిన వారు చెప్పడంతో ఆ మృత దేహం రాయల చంద్రశేఖర్ గా నిర్దారణ అయింది … ఆయన మరణవార్త ఖమ్మం జిల్లా ప్రజలనే గాక , తెలుగు రాష్ట్రాల్లో విప్లవశ్రేణులను షాక్ కు గురిచేసింది ..అనేక ఉద్యమాల్లో పాల్గొన్న చంద్రశేఖర్ రైలు ప్రమాదంలో చనిపోవడం ఆపార్టీని విషాదంలో ముంచింది …భూమికోసం ,భుక్తి కోసం , పేదప్రజల విముక్తి కోసం జరిగిన ఉద్యమాల్లో ఆయన పాత్ర అద్వితీయం …నిరంతరం ప్రజలకోసం ఆలోచనలు చేసే చంద్రశేఖర్ ఇలా విషాదకరంగా మరణించాడని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేక పోతున్నాయి…
రాయల స్వగ్రామం తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామం, వారు నలుగురు అన్నదమ్ములు వారి కుటుంబం పేదప్రజల పక్షాన భూమి కోసం భుక్తి కోసం తెలంగాణ దొరల పెత్తం దారులపై పోరాటం చేసి పేదప్రజల పక్షాన నిలిచారు పలు సందర్భాల్లో జైలు జీవితం గడిపారు, సిపిఐ ఎం ఎల్ కేంద్ర కమిటీ నాయకులు, ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి దివంగత రాయల సుభాష్ చంద్రబోస్ కి స్వయాన సోదరులు మరోకరు వారి సోదరులు రాయల నాగేశ్వరరావు సుదీర్ఘకాలం గ్రామ సర్పంచి గా పనిచేసారు… ఇంకొక సోదరులు అప్పయ్య ఉపాధ్యాయులుగా పనిచేసారు… రాయల చంద్రశేఖర్ కి భార్య విమలక్క , కుమారుడు పావెల్ వున్నారు, చంద్రశేఖర్ మరణం పేద ప్రజలకు ఈ సమాజానికి తీరని లోటని వివిధ పార్టీల ,ప్రజాసంఘాల నేతలు నివాళులు అర్పించారు …
ఆయన మృత దేహాన్ని ఎన్నెస్పీ లోని మాస్ లైన్ జిల్లా కార్యాలయంలో ప్రజల సందర్శనార్థం ఉంచి అక్కడ నుంచి స్వగ్రామం పిండిప్రోలు తీసుకోని వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి…పిండిప్రోలులో అంత్యక్రియలు జరుగుతాయి…