- ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది
- క్షతగాత్రులు ఆసుపత్రికి తరలింపు
- అధికారులకు ఫోన్ చేసి వివరాలు ఆరా తీసిన ముఖ్యమంత్రి యోగి
- హెల్ప్ లైన్ నెంబర్లు విడుదల చేసిన ఈస్టర్న్ రైల్వే
ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం జరిగింది. చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. గోండా – మన్కాపూర్ సెక్షన్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ప్రమాదం జరిగిన విషయం తెలియగానే సహాయక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రమాదంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
చండీగఢ్-డిబ్రూగడ్ ఎక్స్‌ప్రెస్ రైలు 12 కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఝులాహి రైల్వే స్టేషన్‌కు కొన్ని కిలో మీటర్ల సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కోచ్‌లలో ఒకటి పల్టీ కొట్టింది. క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈస్టర్న్ రైల్వే హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చింది.