Drukpadam || దృక్పధం | Daily Telugu News Update
తెలుగు రాష్ట్రాలు

ఆదాయంలో బీఆర్ఎస్ టాప్, ఖర్చులో రెండో స్థానంలో వైసీపీ..

  • 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.737 కోట్లతో అగ్రస్థానంలో బీఆర్ఎస్ 
  • రూ.181 కోట్ల ఖర్చుతో మొదటిస్థానంలో టీఎంసీ
  • రూ.79 కోట్ల ఖర్చుతో రెండో స్థానంలో వైసీపీ

2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ఆదాయంతో ప్రాంతీయ పార్టీల్లో బీఆర్ఎస్ టాప్‌లో నిలిచింది. రూ.737.67 కోట్ల ఆదాయంతో బీఆర్ఎస్ అగ్రస్థానంలో నిలిచింది. ఖర్చులో మాత్రం పశ్చిమ బెంగాల్ ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ రూ.181.18 కోట్లతో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.79.32 కోట్లతో వైసీపీ నిలిచింది. రూ.57.47 కోట్ల ఖర్చుతో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రూ.52.62 కోట్లతో డీఎంకే, రూ.31.41 కోట్లతో సమాజ్‌వాది పార్టీ ఉంది.

ప్రాంతీయ పార్టీల ఆదాయ, వ్యయాలపై ఏడీఆర్ నివేదికను సిద్ధం చేసింది. ఏడీఆర్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 57 ప్రాంతీయ పార్టీలలో 39 పార్టీల ఆదాయ, వ్యయ నివేదికలను వెల్లడించింది. ఆదాయంలో బీఆర్ఎస్ తర్వాత టీఎంసీ రూ.333.45 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. డీఎంకే రూ.214.35 కోట్లతో మూడో స్థానంలో, ఉంది.

Related posts

అమెరికాలో విషాదం.. మరో తెలుగు విద్యార్థి మృత్యువాత…

Ram Narayana

పోలింగ్ రోజున ఏపీ, తెలంగాణలకు వర్ష సూచన…

Ram Narayana

అక్షర సూరీడి అఖరిప్రయాణం…

Ram Narayana

Leave a Comment